Venus Transit: శుక్రాదిత్య రాజయోగం... నాలుగు రాశులకు తిరుగు ఉండదు, ఊహించని డబ్బు..!

Published : Sep 15, 2025, 01:48 PM IST

Venus Transit: ఈ శుక్రగ్రహం సెప్టెంబర్ 15వ తేదీన కర్కాటక రాశిని వీడి సింహ రాశిలోకి అడుగుపెట్టాడు. దీని వల్ల.. సూర్యుడు, శుక్రుడు కలిసి సింహ రాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది.

PREV
15
Venus Transit

జోతిష్యశాస్త్రంలో మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. ఈ తొమ్మిది గ్రహాల్లో శుక్రుడిని చాలా శుభ గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు సంపద, శ్రేయస్సు, ఆనందాన్ని ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు. ఈ శుక్రగ్రహం సెప్టెంబర్ 15వ తేదీన కర్కాటక రాశిని వీడి సింహ రాశిలోకి అడుగుపెట్టాడు. దీని వల్ల.. సూర్యుడు, శుక్రుడు కలిసి సింహ రాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. మరి, ఈ యోగం...ఏయే రాశులకు ప్రయోజనాలు కలిగించనుందో ఇప్పుడు చూద్దాం....

25
1.మేష రాశి...

సెప్టెంబర్ 15 తర్వాత... మేష రాశివారి అదృష్టం రెట్టింపు కానుంది. సూర్యుడు, శుక్రుడి కలయిక సింహ రాశివారి జీవితంలో చాలా మంచి ఫలితాలను మోసుకురానుంది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. జీతం పెరుగుతుంది. ఊహించని వైపు నుంచి కూడా డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో చేసిన అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. సంబంధాలు మెరుగౌతాయి. మిమ్మల్ని మీ భాగస్వామి చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటారు. దీని వల్ల కుటుంబంలో శాంతి నెలకుంటుంది. ఈ సమయంలో భూమి, ఆస్తులు, ఇల్లు, లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

35
2.సింహ రాశి...

సింహ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల సింహ రాశివారికి చాలా మేలు జరగనుంది. సూర్యుడు, శుక్రుడు కలయిక.. రెండూ సింహ రాశివారికి ప్రయోజనాలను మోసుకువస్తుంది. ఈ సమయంలో సింహ రాశివారి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. స్నేహితులు , కుటుంబ సభ్యుల మద్దతుతో, మీరు ఏవైనా సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. శుభవార్తలు వింటారు. పెట్టుబడుల నుండి మీకు మంచి లాభాలు, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. వీటన్నింటి ఫలితంగా, సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది.

45
తుల రాశి...

సూర్య-శుక్ర రాజయోగం తుల రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి రెట్టింపు లాభం లభిస్తుంది. మీ వ్యాపారాన్ని అనేక ప్రదేశాలకు విస్తరించే అవకాశం మీకు లభిస్తుంది. చిన్న వ్యాపారం చేస్తున్న వారికి పెద్ద ఎత్తున మారే అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో రుణం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారికి పదోన్నతి , జీతం పెరుగుదల లభించవచ్చు. చిన్న కంపెనీలో పనిచేసే వారికి బహుళజాతి కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది.

55
ధనుస్సు రాశి..

సూర్య-శుక్ర రాజయోగం ధనుస్సు రాశి వారికి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అప్పుల నుండి విముక్తి పొందడంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో, మీరు మీ పిల్లల నుండి సంతోషకరమైన వార్తలను అందుకుంటారు. ఆధ్యాత్మికతపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు ఆధ్యాత్మిక ప్రయాణం చేపట్టే అవకాశాన్ని ఇస్తుంది. పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం మీకు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories