Venus Transit: శుక్రుడి సంచారంతో ఈ 3 రాశులకు విపరీతమైన డబ్బు యోగం

Published : Apr 04, 2026, 10:52 PM IST

Venus Transit: శుక్రుడు ఉచ్ఛ రాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి భారీగా కలిసివస్తుంది. త్వరలో శుక్రుడు మీనంలోకి ప్రవేశించాడు. దీనివల్ల మాళవ్య, కేంద్ర త్రికోణ రాజయోగాలు ఏర్పతడతాయి. మార్చి 26 వరకు ఈ యోగం ఉంటుంది. దీని వల్ల 3 రాశులదే లక్.

PREV
14
ఈ రాశులకు రాజయోగమే

జ్యోతిషం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో శుక్రుడి బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సంపద కలుగుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.  సుఖసంతోషాలు లభిస్తాయి.  శుక్రుడు సాధారణంగా ఒక రాశిలో ప్రవేశించాక 23 నుంచి 30 రోజుల అక్కడే ఉంటాడు. వృషభ, తులా రాశులకు అధిపతి కూడా ఆయనే. శుక్రుడు రాశి మారినప్పుడల్లా ఆ ప్రభావం అన్ని రాశుల వారి జీవితంపై పడుతుంది. ఇప్పుడు శుక్రుడు తన ఉచ్ఛ రాశి అయిన మీనంలోకి ప్రవేశించాడు.  దీనివల్ల మాళవ్య యోగం, కేంద్ర త్రికోణ రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడుతాయి. మార్చి 2 నుంచి 26 వరకు ఈ  ప్రభావం ఉంటుంది. దీంతో 3 రాశుల వారి జీవితంలో గొప్ప పురోగతి ఉంటుంది.

24
వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశి వారికి శుక్రుడి సంచారం అద్భుతంగా ఉంటుంది. వీరి చేతిలోకి డబ్బు అధికంగా వచ్చి చేరుతుంది.  వీరికి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి ఊహించని లాభాలు వచ్చి పడతాయి. వీరి కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతాి. బంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. 

34
తులా రాశి

తులా రాశి వారికి బాగా కలిసొచ్చే కాలం ఇది. ఉద్యోగం, వృత్తి రంగాల్లో గొప్ప ముందడుగు వేస్తారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి అవకాశాలు రావచ్చు. ఉద్యోగం చేస్తున్నవారికి పై అధికారుల నుంచి మద్దతు దక్కుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. వీరు ఆర్థికంగా బలంగా మారుతారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ  చూపించాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.  వీరు ప్రతిరోజూ వ్యాయామం చేయడం మంచిది. కొత్త అవకాశాలను వస్తాయి.

44
మీన రాశి

మీన రాశి వారికి శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నందున భారీ  అదృష్టం వస్తుంది. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి.ఉద్యోగం వెతుకుతున్న వారికి మంచి  కొత్త ఉద్యోగం దక్కుతుంది.  బంధాలు మరింత మధురంగా మారతాయి. ఆరోగ్యం బావుంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం కకనిపిస్తోంది  ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories