శుక్ర- రాహుల అరుదైన కలయిక.. ఈ మూడు రాశులకు ధనవర్షం

First Published | Dec 4, 2024, 10:57 AM IST

జోతిష్య నిపుణుల ప్రకారం... వచ్చే ఏడాది అంటే 2025లో  శుక్ర, రాహు గ్రహాల అరుదైన కలయిక జరగనుంది. ఈ కలయిక మూడు రాశులకు అదృష్టాన్ని తీసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....

గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఆ మారే క్రమంలో ఒక్కోసారి రెండు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడుతుంది.  అది కొన్ని రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. వచ్చే ఏడాది 2025 లో జనవరి 28వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఆల్రెడీ  ఇఫ్పటికే అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది  ఈ రెండూ రాశుల అరుదైన గ్రహాల కలయిక ఏర్పడుతుంది. మరి, ఈ కలయిక మూడు రాశుల లైఫ్ మార్చనుంది. వారి ఇంట ధన ప్రవాహం  కూడా పెరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి వారికి శుక్ర-రాహు కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరడం మొదలవుతుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితంలోని అన్ని సుఖాలను అనుభవిస్తారు.


తుల రాశి..

తులారాశి వారికి కొత్త సంవత్సరం శుభవార్తలు తెస్తుంది. మీ పనిని చూసి అధికారులు సంతోషిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. పిల్లల చదువుల గురించి చింత తీరుతుంది. పెళ్లికాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి. వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

కర్కాటక రాశి...

కర్కాటక రాశి వారికి తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కలలు నెలవుతాయి. సమాజ సేవకు మొగ్గు చూపుతారు. దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలు వస్తాయి.

Latest Videos

click me!