హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు. ఇల్లు, ఇంటి పరిసరాలు, ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం ఉంటే ఎలాంటి ఇబ్బందులు రావని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని ప్లేసుల్లో కొన్ని వస్తువులు పెట్టడం, కొన్నింటిని తొలగించడం ద్వారా ఇంట్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు నెలకొంటాయి. ఎలా ఉంటే ఇంటి వాతావరణం బాగుండి.. కష్టాలు తొలగిపోతాయో ఇక్కడ తెలుసుకుందాం.
బెడ్ రూమ్ లో ఇది పెట్టొద్దు!
వాస్తు ప్రకారం మీరు పడుకునే గదిలో అద్దం పెట్టకూడదు. ఇది నెగెటివ్ ఎనర్జీని తెస్తుందని నమ్ముతారు. నైరుతి దిశ స్థిరత్వం, బలానికి సంబంధించింది. కాబట్టి, ఈ దిశలో మీ మంచం ఉంచడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో రక్షణ, స్థిరత్వం ఉంటాయి. మీ మంచం ఆగ్నేయ మూలలో నీటిని ఉంచడం మానుకోండి. లేదంటే ఆర్థిక నష్టం వస్తుంది.
ఇంట్లో పూలు, మొక్కలు:
ఇంట్లో పూలు, మొక్కలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది గాలిని శుద్ధి చేసి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో వేప చెట్టు, తులసి మొక్క వంటివి పెట్టుకోవచ్చు.
ఫర్నిచర్ ఇలా పెట్టాలి:
వాస్తు ప్రకారం ఫర్నిచర్ చాలా ముఖ్యం. ఇది స్వేచ్ఛగా కదిలేలా, శక్తి లోపలికి, బయటికి వెళ్లేలా ఉండాలి. గది మధ్యలో ఫర్నిచర్ పెట్టకూడదు. ఇది పాజిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. ఫర్నిచర్ ను గోడలకు ఆనుకుని పెట్టండి. మీ కుటుంబ బంధాన్ని బలోపేతం చేయడానికి గది గోడపై ఒక ఫ్యామిలీ ఫోటోను వేలాడదీయండి.
పాజిటివ్ ఎనర్జీ కోసం స్ఫటికాలు..
స్ఫటికాలు, రత్నాలు ఇంటిలో, ఆఫీసులో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొన్ని రత్నాలు శాంతి, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయని నమ్ముతారు. వీటిని ఈశాన్య దిశలో ఉంచాలి.
బాత్రూమ్:
మీ ఇంటి బాత్రూమ్ వాస్తు ప్రకారం ఉండాలి. బాత్రూమ్ కు లేత రంగులు వేయచ్చు. ఇవి పాజిటివ్ ఎనర్జీని తెచ్చి ప్రశాంతంగా ఉంచుతాయి. టాయిలెట్ సీటు ఉత్తరం లేదా దక్షిణం వైపు ఉండాలి. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఎప్పుడూ మూసి ఉంచాలి. బాత్రూమ్ తలుపు కూడా మూసి ఉంచాలి. దీనివల్ల ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ రాదు. బాత్రూమ్ తలుపు వెనుక అద్దం పెడితే మీకు చాలా మంచిది.