Ugadi Rashiphalalu: విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి ఫలితాలు
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో పదకొండో రాశి అయిన కుంభ రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో పదకొండో రాశి అయిన కుంభ రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
కుంభ రాశి ఆదాయం-8, వ్యయం-14, రాజ్యపూజ్యం-07, అవమానం-05
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో పదకొండో రాశి అయిన కుంభ రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి మిశ్రమంగా ఉండనుంది. గ్రహ స్థితుల ప్రభావం కారణంగా కొన్ని అనుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, వాటిని చూసి సంతోషించేలోగా.. ప్రతికూలపరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏలినాటి శని చివరి దశలో ఉండటంతో దాని ప్రభావం గట్టిగా ఉంటుంది. చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బృహస్పతి మే నెలలో రాశి మారడం వల్ల మీరు కోరుకున్నవి జరిగే అవకాశం ఉంది. రాహువు జన్మ రాశిలో అడుగుపెట్టినప్పుడు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి.కుటుంబ పరంగా ఒత్తిడి, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రావచ్చు. అయితే.. ఆత్మ స్థైర్యంతో ఎదుర్కొని నిలపడితే విజయం మీకు దక్కే అవకాశం ఉంటుంది.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి ఆర్థిక పరిస్థితి:
ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా వచ్చిన ఖర్చులు అదుపులో లేకుండా పోవచ్చు. మే నెల తర్వాత వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులకు కొంత స్థిరమైన స్థితి లభించవచ్చు. అప్పులు తీసుకోవడం, ఇస్తే జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ధనలాభం కూడా సంభవించొచ్చు కానీ వాటిని ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు చేయాలంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొందరికి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించవచ్చు.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి ఆరోగ్య పరిస్థితి:
ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కుంభ రాశి వారికి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. మే తర్వాత గురు గ్రహ ప్రభావం కొంత వరకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పటికీ, రాహువు ప్రభావం వల్ల ఆకస్మిక అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. యోగం, ధ్యానం వంటి చర్యలు పాటిస్తే మంచిది.
విశ్వావసు నామ సంవత్సరంలో కుంభ రాశి ఉద్యోగ వ్యాపార పరిస్థితి:
ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం కొంత ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది. బదిలీలు, ఉద్యోగ మార్పులు జరగవచ్చు. కొన్ని సమస్యలు అధిగమించినా, కొన్ని కొత్తగా ఎదురవుతాయి. వ్యాపారవేత్తలకు మధ్యస్థంగా ఉంటుంది. మే నెల తర్వాత కొంత మెరుగైన పరిస్థితులు ఉండొచ్చు. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. ఉద్యోగస్తులు పై అధికారులతో మెలకువగా వ్యవహరించాలి. రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది.
మాసవారీ ఫలితాలు:
ఏప్రిల్ 2025
ఈ నెలలో సానుకూలతలు ఎక్కువగా కనిపిస్తాయి. నూతన అవకాశాలు, శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాల సూచనలు. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు ఉంటాయి.
మే 2025
ఆర్థికంగా కొంత గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు. కుటుంబ సభ్యులతో మిశ్రమ అనుభవాలు. అనవసర వివాదాలు దూరంగా ఉండాలి.
జూన్ 2025
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కార్యస్థలంలో ఒత్తిడులు అధికం. స్నేహితుల నుంచి సహాయం లభించవచ్చు. ధన ప్రయోజనాలు కొంత సడలతాయి.
జూలై 2025
ఆర్థికంగా కొంత స్థిరత లభించవచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిడులు తగ్గుతాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు లాభదాయక సమయం.
ఆగస్టు 2025
ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం. అనవసర ధన వ్యయం. శత్రువుల నుంచి జాగ్రత్త. ప్రయాణాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు.
సెప్టెంబర్ 2025
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని కొత్త అవకాశాలు. రుణ భారాలు తగ్గించే ప్రయత్నం. కుటుంబంలో హర్షాతిరేక పరిస్థితులు. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం.
అక్టోబర్ 2025
శారీరక, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. కార్యస్థలంలో ఒత్తిడి పెరిగే అవకాశం. ధనలాభం కనిపించవచ్చు. కుటుంబంలో కొన్ని మార్పులు.
నవంబర్ 2025
ఈ నెల కొంత కలసి వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు, నూతన ఆదాయ మార్గాలు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం.
డిసెంబర్ 2025
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు. కుటుంబంలో తగాదాలు దూరం చేసుకోవాలి. కొత్త అవకాశాలు రావొచ్చు.
జనవరి 2026
ఆర్థికంగా కొంత స్థిరత లభించవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు. వ్యాపారులకు కొంత వృద్ధి. కుటుంబ కలహాలు తగ్గుతాయి.
ఫిబ్రవరి 2026
ఆరోగ్యపరంగా మెరుగుదల. కొత్త అవకాశాలు. ఖర్చులు అదుపులో ఉంటాయి. శుభకార్యాలకు అవకాశం.
మార్చి 2026
ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి. వ్యాపారులకు లాభదాయక సమయం. కుటుంబ సౌఖ్యం మెరుగుపడే అవకాశం.