సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్నితేదీల్లో పుట్టిన వ్యక్తులు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి చర్చిస్తారట. నమ్మిన వాళ్లకే వెన్నుపోటు పొడుస్తారట. ఇతరుల రహస్యాలు బయటపెట్టి మోసం చేయడానికి కూడా వెనకాడరట. మరి ఏ తేదీలో పుట్టినవారికి ఇలాంటి లక్షణాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఏ తేదీల్లో పుట్టిన వారిని నమ్మకూడదు?
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్లకి ఇలాంటి లక్షణాలు ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారట. ఇతరుల గురించి సమాచారం సేకరించే అలవాటు వీరికి ఉంటుందట. ఇతరుల జీవితాల గురించి రహస్యాలు తెలుసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వెనకాడరట.
ఏ తేదీల్లో పుట్టిన వారు మోసం చేస్తారు?
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్లు చిన్నప్పటి నుంచే గాసిప్స్ చెప్పడం, ఇతరుల జీవితాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారట. వీళ్ళు మోసం చేయడానికి కూడా వెనుకాడరట. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారిని ఎవరూ నమ్మకూడదని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
ఈ తేదీల్లో పుట్టిన వారు స్నేహంగా ఉంటూనే..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్లు సాధారణంగా అందరితో స్నేహంగా ఉంటారట. కానీ ఈ స్వభావం వల్ల ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడుతారట. అవకాశం వస్తే మోసం చేయడానికి కూడా వెనకాడరట.
ఈ తేదీల్లో పుట్టిన వారు నమ్మకంగా ఉండరు!
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 27 వ తేదీన పుట్టిన వాళ్ళు అందరితో బాగా కలిసిపోతారు. నలుగురితో మాట్లాడడానికి ఇష్టపడతారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో చెప్పడానికి ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల వారు మీ నమ్మకాన్ని కోల్పోతారు.