Vastu: ఇంటి ప్ర‌ధాన ద్వారంలో ఇదొక్క‌టి పెట్టి చూడండి.. మీ జీవితం మార‌డం ఖాయం

Published : Feb 19, 2026, 02:56 PM IST

Vastu: వాస్తు శాస్త్రంలో స్ప‌టికానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్ప‌టికం ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని నమ్మకం. ఈ పరిహారం ఎలా పనిచేస్తుంది? ఏమేమి లాభాలు ఉంటాయి? తెలుసుకుందాం. 

PREV
15
ప్రధాన ద్వారం ఎందుకు ముఖ్యమైంది?

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం శక్తి ప్రవేశించే ప్రధాన స్థానం. బయట నుంచి వచ్చే శక్తులు ఇక్కడి నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ద్వారం శుభ్రంగా, శక్తిమంతంగా ఉంటే ఇంట్లో శాంతి, ఆనందం పెరుగుతాయని విశ్వాసం. అందుకే ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తారు.

25
నెగటివ్ ఎనర్జీని ఎలా తగ్గిస్తుంది?

వాస్తు నమ్మకాల ప్రకారం స్ప‌టికం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంటి మెయిన్ గేట్ వద్ద స్ప‌టికం ముక్కను ఉంచడం లేదా గాజు సీసాలో వేసి వేలాడదీయడం వల్ల చెడు శక్తులు లోపలికి రాకుండా అడ్డుకుంటుందని చెబుతారు. ఇది చెడు దృష్టి, ప్రతికూల ఆలోచనలు, బాహ్య ప్రభావాలను ఆకర్షించి వాటిని నిరుపయోగంగా మార్చుతుందని నమ్మకం.

35
దృష్టిదోషం, వాస్తు దోషం నివారణ

చాలా ఇళ్లలో దృష్టిదోషం ఉందని భావించినప్పుడు స్ప‌టికంను ఉపయోగిస్తారు. ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు ఇది మంచిదని చెబుతారు. అలాగే దిశలకు సంబంధించిన చిన్న వాస్తు లోపాలను సరిచేయడంలో కూడా ఇది సహాయకరం అని కొందరు విశ్వసిస్తారు. గాజు జార్‌లో స్ప‌టికం ఉంచి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం ద్వారా శక్తి సమతుల్యత ఏర్పడుతుందని చెబుతుంటారు.

45
ఇంటి వాతావరణం, ఆరోగ్యంపై ప్రభావం

స్ప‌టికం సహజంగా క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. గాలి శుద్ధి చేయడంలో ఇది కొంతమేర సహాయపడుతుందని వైద్య పరంగా కూడా చెబుతుంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే చెడు కలలు, ఆందోళన, అశాంతి తగ్గుతాయని నమ్మకం. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండటానికి ఇది తోడ్పడుతుందని కొందరు న‌మ్ముతారు.

55
స్ప‌టికం వాడేటప్పుడు పాటించాల్సిన సూచనలు

ప్రధాన ద్వారం దగ్గర చిన్న స్ప‌టికం ముక్కను గాజు సీసాలో ఉంచవచ్చు. స్ప‌టికం రంగు మారితే లేదా చిన్నదిగా కరిగిపోతే దాన్ని మార్చాలి. సాధారణంగా వారానికి ఒకసారి మార్చడం మంచిదని సూచిస్తారు. అలాగే ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని నిత్యం శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం.

గ‌మ‌నిక‌:

మొత్తంగా స్ప‌టికాన్ని వాస్తు పరంగా ఒక సులభమైన పరిహారంగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటానికి సహాయపడుతుందని విశ్వాసం. అయితే ఇవి సంప్రదాయ నమ్మకాల ఆధారంగా ఉన్న సూచనలు మాత్రమే. జీవితం మారాలంటే కృషి, సానుకూల ఆలోచన, శుభ్రత, పరస్పర గౌరవం కూడా అంతే అవసరమ‌ని గుర్తించాలి.

Read more Photos on
click me!

Recommended Stories