నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు సహజ సిద్ధంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి వేరే వారి కింద పని చేయడం ఇష్టం ఉండదు. తమ సొంతంగా, తమ స్వయం కృషితో పైకి ఎదగడానికి ఇష్టపడతారు. వీరికి సొంతంగా సామ్రాజ్యాలను నిర్మించాలనే తపన వీరిలో ఉంటుంది. వీరు కష్టపడి లైఫ్ లో విజయం సాధిస్తారు. వారి కష్టార్జితంతోనే ధనవంతులు అవుతారు.