నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కి చెందిన వారే. వీరిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉగాది తర్వాత.. ఈ తేదీల్లో పుట్టిన వారిపై గురు గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా.. వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి.
మరీ ముఖ్యంగా, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు , ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు ఏ పని మొదలుపెట్టినా.. పెద్దల సలహాలు తీసుకోవాలి. అప్పుడే.. విజయం సాధించగలరు.