Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశి ఫలితాలు
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఏడో రాశి అయిన తులరాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఏడో రాశి అయిన తులరాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
తుల రాశి ఆదాయం-11, వ్యయం-5, రాజ్యపూజ్యం-2, అవమానం-2
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఏడో రాశి అయిన తులరాశి గురించి సవివరంగా తెలుసుకుందాం..
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశివారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. బృహస్పతి గ్రహం మే నుంచి తొమ్మిదో స్థానంలో సంచరించడంతో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. శని ఆరో స్థానంలో ఉండటంతో కష్టాలు, బాధలు తొలగిపోతాయి. రాహువు ఐదో స్థానంలో, కేతువు పదకొండో స్థానంలో ఉండటంతో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది ఉద్యోగులకు ప్రమోషన్లు, వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే.. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశి ఆర్థిక పరిస్థితి:
ఈ సంవత్సరం తులా రాశి వారికి ఆర్థికంగా మంచి స్థిరత్వం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం జరగవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. పెట్టుబడులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు తెలిసినవారిని సంప్రదించాలి.
విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశి ఆరోగ్యం:
ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. శరీర బాధలు, మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే, శారీరక సమస్యలు ఎక్కువగా ప్రభావితం కావు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం.
విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశి ఉద్యోగం & వ్యాపారం:
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభించవచ్చు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలరు. అధికారులతో అనుకూలంగా మెలగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన కాలం. నూతన వ్యాపార అవకాశాలు రాబోవచ్చు. నూతన ప్రాజెక్టుల పెట్టుబడులకు ఇది మంచి సమయం.
విశ్వావసు నామ సంవత్సరంలో తుల రాశి కుటుంబ జీవితం & సంబంధాలు:
కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా ఆనందకరమైన అనుభవాలు పొందగలరు. పిల్లల వల్ల కొన్ని ఆందోళనలు రావచ్చు. బంధుమిత్రులతో సఖ్యతతో ఉండటం మంచిది. ముఖ్యంగా మే నెల తర్వాత బంధువులతో మేలిమి సంబంధాలు ఏర్పడతాయి.
మాసవారీ ఫలితాలు:
ఏప్రిల్: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు, గృహ మార్పులు, వ్యయ ప్రాప్తి. దేవాలయ దర్శనాలు జరుగుతాయి.
మే: సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధనలాభం, నూతన గృహ నిర్మాణం, వివాహ ప్రయత్నాలు విజయవంతం.
జూన్: తీర్థయాత్రలు, కొత్త వస్తువుల కొనుగోలు, ఆభరణాల వ్యయం. కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
జూలై: కుటుంబ ఆనందం, వ్యవసాయంలో చిక్కులు, విద్యార్థులకు అనుకూలత. కొత్త అవకాశాలు ఎదురవుతాయి.
ఆగస్టు: నూతన వస్త్రాల కొనుగోలు, మానసిక ఆలోచనలు. కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశం.
సెప్టెంబర్: సంఘంలో గౌరవం, ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు. అనుకున్న పనులు పూర్తవుతాయి.
అక్టోబర్: బంధువుల సహాయం, మానసిక ఆందోళనలు. అధికార ఒత్తిడి, పనుల్లో ఆటంకాలు.
నవంబర్: వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పురోగతి. వాహన కొనుగోలు, ధన పరంగా స్వల్ప ఇబ్బందులు.
డిసెంబర్: భూమి తగాదాలు, గర్వం పెరుగుట. శుభకార్యాల నిర్వహణ, ప్రముఖులతో భేటీ.
జనవరి: శుభకార్యాలకు అధిక ఖర్చు, వాహన ప్రమాదాలు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు.
ఫిబ్రవరి: ధన నష్టం, స్త్రీ అపవాదాలు. వినోదాల కోసం అధిక ఖర్చు. పోలీస్ కేసుల ముప్పు.
మార్చి: పుణ్య నదీ స్నానాలు, రుణ ప్రయత్నాలు సఫలీకృతం. వస్తు సామాగ్రి కొనుగోలు, గౌరవ ప్రతిష్ట పెరుగుట.
శుభ పరిహారాలు:
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి కనకధారా స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజున ఆవునేతి దీపం వెలిగించడం మంచిది. ఆదిత్య హృదయం పారాయణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేస్తే దోషాలు తగ్గి, శుభ ఫలితాలు పొందవచ్చు.