Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో కన్య రాశి ఫలితాలు
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఆరో రాశి అయిన కన్య రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఆరో రాశి అయిన కన్య రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
కన్య రాశి ఆదాయం-14, వ్యయం-2, రాజ్యపూజ్యం-6, అవమానం-6
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో ఆరో రాశి అయిన కన్య రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం.
ఈ ఏడాది కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గురు, శని, రాహు, కేతు గ్రహాల ప్రభావం వల్ల కొంత వరకు ఆర్థిక లాభాలు చూసే అవకాశం ఉంది. కానీ కొన్ని అనుకోని ఆటంకాలు, ఖర్చులు, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురౌతాయి.మే నెల వరకు గురు వృషభ రాశిలో ఉండటం వల్ల కొత్త అవకాశాలు, ప్రయాణాలు, ధనప్రాప్తి, భూ సంబంధమైన లావాదేవీలు కలుగుతాయి. ఆ పై గురు మిథున రాశిలో ఉండటం వల్ల కుటుంబంలో ఒత్తుడులు, ఉద్యోగంలో పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. అంతేకాదు, శని మీన రాశిలో సంచారం కారణంగా సంతానం, కుటుంబ సంబంధ సమస్యలు వస్తాయి. కుటుబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. రాహు, కేతువు మే వరకు మీన-కన్య రాశులలో ఉండగా, మే తర్వాత కుంభ-సింహ రాశులలోకి మారతాయి. దీని ప్రభావంతో కొందరి మీద అపవాదాలు రావచ్చు, అనుకోని మార్పులు సంభవించవచ్చు, ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది కన్య రాశి వారికి కొత్త అవకాశాలు, ఆర్థిక అభివృద్ధి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కొంత ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమయ్యే సంవత్సరం.
విశ్వావసు నామ సంవత్సరంలో కన్య రాశి ఆర్థిక పరిస్థితి
ఈ ఏడాది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలే ఎదురుకానున్నాయి. ఆదాయ వృద్ధి చోటుచేసుకున్నా, ఖర్చులు కూడా తగినంతగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది కొంత లాభదాయకంగా ఉంటుంది. భూములు, ఇళ్ల కొనుగోలుకు ఇది మంచి కాలం. అయితే, రాహువు ప్రభావం వల్ల ఏప్రిల్-మే వరకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.
విశ్వావసు నామ సంవత్సరంలో కన్య రాశి ఆరోగ్య పరిస్థితి
సంవత్సర మొదటి భాగంలో ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంటే, మే-జూలై మధ్యకాలంలో శారీరక అలసట, ఒత్తిడి పెరుగుతుంది. తలనొప్పి, కడుపు సమస్యలు, జీర్ణ సంబంధ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మారిన వాతావరణ ప్రభావం వల్ల జలుబు, కఫ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం ఎంతో అవసరం.
విశ్వావసు నామ సంవత్సరంలో కన్య రాశివారి ఉద్యోగం - వ్యాపార ఫలితాలు
ఉద్యోగస్తులకు ఈ ఏడాది మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. పదోన్నతులు రావచ్చు, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, మే-జూన్ మధ్య కాలంలో పనిభారం పెరుగుతుంది. అధిక ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోయే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయక సంవత్సరం అయినప్పటికీ, ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అవినీతికి, అపవాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం.
నెలల వారీ ఫలితాలు
ఏప్రిల్ 2025: కొత్త అవకాశాలు, ఇంటి కోసం ఖర్చులు, కుటుంబ సంఘర్షణలు.
మే 2025: వృథా ఖర్చులు పెరుగుతాయి, ఉద్యోగ మార్పులకు అనుకూలం.
జూన్ 2025: అనుకోని ప్రయాణాలు, ఆరోగ్య సమస్యలు, కొత్త పెట్టుబడులకు జాగ్రత్త.
జూలై 2025: శుభకార్యాలు, ఆర్థిక లాభాలు, కానీ కొంత ఒత్తిడి.
ఆగస్టు 2025: కుటుంబ సమస్యలు, ఆకస్మిక ఖర్చులు, మనశ్శాంతి కొంత తగ్గుతుంది.
సెప్టెంబర్ 2025: భూములు, స్థిరాస్తి లావాదేవీలు అనుకూలం, ఆరోగ్య జాగ్రత్తలు.
అక్టోబర్ 2025: ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, కొంత ఒత్తిడి.
నవంబర్ 2025: ఉద్యోగ, వ్యాపార వృద్ధి, కానీ ధన వ్యయం అధికం.
డిసెంబర్ 2025: అనుకోని సంఘటనలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక నష్టం.
జనవరి 2026: శుభకార్యాలు, కుటుంబ కలహాలు తగ్గుతాయి, వ్యాపారంలో లాభం.
ఫిబ్రవరి 2026: కోర్టు వ్యవహారాలు పరిష్కారం, వాహన, ఆభరణాల కొనుగోలు.
మార్చి 2026: వ్యాపార, ఉద్యోగ అభివృద్ధి, పిల్లలతో ఆనంద క్షణాలు.
శుభఫలితాల కోసం పరిహారాలు
ఈ ఏడాది మంచి ఫలితాలను పొందేందుకు కొన్ని పరిహారాలు చేయడం మంచిది. గురువారాలు గణపతి పూజ చేయడం ఎంతో శుభప్రదం. శనివారం వ్రతం ఆచరించడం వల్ల శని అనుకూలంగా మారుతాడు. సూర్యుని ప్రీత్యర్థం ఆదిత్య హృదయం పారాయణం చేయడం ఆరోగ్య పరంగా ప్రయోజనకరం. పుట్టినరోజున గోధుమలు దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
చివరగా..
కన్య రాశి వారికి 2025-26 సంవత్సరంలో ఆర్థికంగా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం, ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. కుటుంబంలో కొంత ఒత్తిడి, అభిప్రాయ భేదాలు రావచ్చు. ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకు సాగితే గొప్ప విజయాలను సాధించగలరు.