ఉగాది తర్వాత శని సంచారంలో మార్పులు రానున్నాయని పండితులు చెబుతున్నారు. జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 రాశుల్లో శని భగవానుడు ఉంటే.. ఆ మూడు రాశులకు శని భగవాడును అఖండ రాజయోగాన్ని అందిస్తాడని పండితులు చెబుతున్నారు. ఇలా వచ్చే ఏడాది మొత్తం 12 రాశుల్లో మూడు రాశుల వారికి మంచి జరగనుంది. ఇంతకీ ఆ రాశులు ఏంటంటే..
Libra
తుల రాశి:
ఉగాది పర్వదినం తర్వాత తుల రాశి వాళ్లకి శని భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేయనున్నాడు. దీని కారణంగా ఈ రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఉగాది తర్వాత పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు అప్పులు కూడా తీరుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. శత్రువుల నుంచి విముక్కి లభిస్తుంది. ఇతరుల నుంచి ఎదురయ్యే దృష్టిలోపాలు కూడా దూరమవుతాయి. అలాగే చేపట్టిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ధన లాభం ప్రాప్తిస్తుందని పండితులు అభిప్రాయపడుతున్నారు.
capricorn
మకర రాశి:
ఉగాది తర్వాత శని కుంభ రాశిలో నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని సంచారంలో మార్పు జరిగిన మీన రాశి మూడవ రాశి అవుతుంది. దీంతో మకరరాశి వాళ్లకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో మూడో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది మకర రాశి వారి ఎంతగానో కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి వచ్చే ఏడాది కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల విషయంలో లాభం చేకూరుతుంది. అనుకున్న పనులు సవ్యంగా పూర్తవుతాయి.
Image: Pexels
వృషభ రాశి:
ఉగాది తర్వాత లబ్ధి పొందే రాశి మరేదైనా ఉందంటే అది వృషభ రాశి అని పండితులు చెబుతున్నారు. శనిసంచారం కారణంగా వృషభ రాశి 11వ స్థానంలో ఉండనుంది. దీంతో ఈ రాశి వారికి ఏడాది కష్టానికి మించిన ఫలితం రానుంది. వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి. మంచి ధన లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ ఏడాది వృషభ రాశి వారికి ఎలా చూసుకున్నా మంచి జరుగుతుందని పండితులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.