Love Marriage: ప్రేమికులు పెద్దల అంగీకారంతో పెళ్లి కావాలని కోరుకుంటారు. అలా కాకపోతే ఇంట్లోంచి వెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంత కష్టం లేకుండా ఒక గుడికి వెళితే చాలు ప్రేమికులకు పెద్దల అంగీకారంతో పెళ్లయిపోతుంది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంత సులువు కాదువ. అందుకు పెద్దలను ఒప్పించాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. కులాలు, డబ్బు అంతరాలు చూపిస్తూ పెళ్లికి అడ్డుపడతారు. కొందరైతే ప్రేమను గెలిపించుకోవడానికి జీవితాంతం కుటుంబంతో పోరాడాల్సి వస్తుంది. ప్రేమ పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోరేమోనని భయం ఉంటే వెంటనే మీరు ఓ ఆలయానికి వెళ్లాలి. అక్కడికి వెళితే కచ్చితంగా ప్రేమికులకు పెళ్లవుతుందట.
పెద్దల అంగీకారంతో పెళ్లి కావాలని కోరుకుంటున్న ప్రేమికులు ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటి. సాక్షాత్తూ శివుడు, పార్వతీ దేవి వివాహం ఇక్కడే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
25
ఎందుకు అంత ప్రత్యేకం?
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది త్రియుగినారాయణ్ ఆలయం. దీన్ని పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేశారు. అయితే ఇక్కడే శివపార్వతుల వివాహం జరిగిన ప్రదేశంగా చెప్పుకుంటారు. ఈ పెళ్లికి విష్ణువు కూడా హాజరయ్యాడని అంటారు. విష్ణువు సాక్షాత్తూ పార్వతీ దేవి సోదరుడిగా వ్యవహరించగా, బ్రహ్మదేవుడు పురోహితుడిగా శివ పార్వతుల వివాహం జరిపించారు.
35
మండుతూనే ఉన్న అగ్ని
హిమాలయాల్లో సుమారు 6,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయంలో 'అఖండ ధుని' అనే పవిత్ర అగ్ని ఉంటుంది. ఇది అఖండంగా మండుతూనే ఉంటుంది. ఇది శివపార్వతుల పెళ్లి సమయంలో వెలిగించిన అగ్నిహోత్రమని అంటారు. అప్పటి నుంచి ఇది ఆరకుండా మండుతూనే ఉందని భక్తుల నమ్మకం. ఈ అగ్నిని దర్శించుకుంటే వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయని అంటారు.
ఈ ఆలయానికి దగ్గరే రుద్ర కుండ్, విష్ణు కుండ్, బ్రహ్మ కుండ్ అనే మూడు పవిత్ర సరస్సులు ఉన్నాయి. తమ పెళ్లికి ముందు శివపార్వతులు ఈ చెరువుల్లోనే స్నానం చేశారని అంంటారు. అందుకే ఇప్పటికీ చాలా జంటలు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ పెళ్లి చేసుకుంటే బంధం శాశ్వతంగా నిలుస్తుందని నమ్ముతారు.
55
ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి?
ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగినారాయణ్ గ్రామంలో ఉంది. సోన్‌ప్రయాగ్ నుంచి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సోన్‌ప్రయాగ్ నుంచి దారి అడవుల మధ్య నుంచి ఉంటుంది. ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. కానీ ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య వాతావరణం చాలా బాగుంటుంది. గ్రామంలో ఉండటానికి హోంస్టేలు, లాడ్జీలు వంటివి అందుబాటులో ఉన్నాయి.