Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు చిన్నవయసులోనే ధనవంతులవుతారు..!

Published : Oct 10, 2025, 06:08 PM IST

బాగా డబ్బు సంపాదించాలని.. లగ్జరీగా బ్రతకాలని చాలామంది కోరుకుంటారు. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు చిన్నవయసులోనే ధనవంతులవుతారట. వారిలో ఉన్న కొన్ని లక్షణాలే అందుకు కారణమట. ఆ నక్షత్రాలేంటో చూద్దామా..

PREV
16
Birth Stars:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల స్థితి, వాటి మార్పుల ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని వారి జన్మ నక్షత్రం అంటారు. ప్రతి నక్షత్రానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు, శక్తులు ఉంటాయి. కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారికి చిన్న వయస్సులోనే ధన ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

26
అశ్విని నక్షత్రం

అశ్విని నక్షత్రం మేష రాశికి చెందింది. ఈ నక్షత్రంలో పుట్టినవారు బలమైన సంకల్పశక్తి, చురుకుదనం కలిగి ఉంటారు. వీరు చిన్నప్పటి నుంచే ఏదో సాధించాలనే తపనతో జీవిస్తారు. వ్యాపారం, టెక్నాలజీ రంగాల్లో వీరికి మంచి అభిరుచి ఉంటుంది. వీరికి నిర్ణయం తీసుకునే శక్తి ఎక్కువగా ఉండటం వల్ల చిన్న వయసులోనే వ్యాపార అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. వీరి స్వతంత్ర ఆలోచనలు, కొత్త కొత్త ప్రయోగాలు డబ్బుల వర్షం కురిపిస్తాయి. 

36
మృగశిర నక్షత్రం

మృగశిర నక్షత్రం మిథున, వృషభ రాశులకు సంబంధించింది. ఈ నక్షత్రంలో పుట్టినవారికి శాస్త్ర విజ్ఞానం, పరిశోధనా నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్, ఐటీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ. వీరికున్న కష్టపడే స్వభావం కారణంగా చిన్న వయసులోనే మంచి ఉద్యోగం పొందుతారు. తెలివిగా సంపద కూడబెట్టుకుంటారు.

46
మఖ నక్షత్రం

మఖ నక్షత్రం సింహ రాశికి చెందింది. ఈ నక్షత్రంలో పుట్టినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరిలో గర్వం, పేరు ప్రతిష్టలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే ఎదగాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగం, పబ్లిక్ రిలేషన్స్ వంటి వాటిలో వీరు బాగా రాణిస్తారు. అందులోనే డబ్బు సంపాదిస్తారు. సమాజంలో గుర్తింపు కావాలనే తపన వీరిని ముందుకు నడిపిస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టినవారు వారసత్వ సంపద కూడా పొందే అవకాశం ఉంది.

56
స్వాతి నక్షత్రం

స్వాతి నక్షత్రం తుల రాశికి చెందింది. ఈ నక్షత్రంలో పుట్టినవారు కష్టపడే లక్షణం కలిగి ఉంటారు. వీరు తెలివిగా వ్యవహరించడం వల్ల మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ బలంగా ఉండటం వల్ల మార్కెటింగ్, కమర్షియల్ రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి. వీరు ఫ్రీలాన్స్ ఇంకా వ్యాపారాల్లో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ. ఫలితంగా చిన్న వయసులోనే వీరు ధనవంతులు అవుతారు.

66
రోహిణి నక్షత్రం

ఈ నక్షత్రం వృషభ రాశికి చెందింది. ఇది చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం. రోహిణి నక్షత్రంలో పుట్టినవారికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, మంచి నైపుణ్యాలు, విలాసవంతమైన జీవితం పట్ల ఆకాంక్ష ఉంటాయి. వీరికి ప్రతి పనిలో విజయం సాధించాలనే తపన ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఫ్యాషన్, సినిమా వంటి రంగాల్లో ముందుంటారు. వీరి సృజనాత్మకత చిన్న వయసులోనే వీరిని ధనవంతులుగా మార్చుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories