1.మేష రాశి...
ధనత్రయోదశి వేళ మేష రాశివారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. ఈ కాలంలో ఈ రాశివారి సంపద అపారంగా పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. గతంతో పోలిస్తే.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే.. ఆ డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. అదేవిధంగా, ఉద్యోగంలోనూ చాలా మార్పులు జరగనున్నాయి. ఆఫీసు మారాలి అనుకునేవారికి ఇది కరెక్ట్ సమయం. జీతం పెరగడం, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో శారీరక ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది.