
జోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి రాశికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వారి స్వభావాన్ని కూడా జోతిష్యం ఆధారంగా తెలుసుకోవచ్చు. కొన్ని రాశుల వారు ధైర్యవంతులు అయితే, మరి కొందరు తెలివి, చాకచక్యానికి మారుపేరుగా నిలుస్తారు. ఇక..కొందరు మహిళలు నక్కల వలె చాకచక్యంగా, బుద్ధిమంతులుగా వ్యవహరిస్తారు. అంటే.. వీలైనంత వరకు ఈ రాశి అమ్మాయిలు ఎవరి చేతుల్లోనూ మోసపోరు. కానీ, ఇతరులను మాత్రం చాలా ఈజీగా మోసం చేయగలరు. మరి, ఆ రెండు రాశులేంటో చూద్దామా...
వృశ్చిక రాశి అమ్మాయిల తెలివిని గుంట నక్క తెలివితో పోల్చవచ్చు. వీరు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆచి తూచి అడుగు వేస్తారు. వీరు చూడటానికి చాలా గంభీరంగా ఉంటారు. చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు. తమ మనసులో ఉన్న విషయాన్ని అస్సలు బయటపెట్టరు. వారు తమ ఎమోషన్స్ ని ముఖం లో చూపించరు. ఎదుటి వ్యక్తి పై ఎంత కోపం ఉన్నా, నవ్వుతూనే మాట్లాడతారు. వీరు అంతర్గతంగా శక్తివంతమైన అంతర్ దృష్టిని కలిగి ఉంటారు. ఇతరుల మనసు ఆలోచనలు సులభంగా అర్థం చేసుకుంటారు. లక్ష్య సాధన కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. తాము ఎప్పుడు ఏమి చేయాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో వీరికి బాగా తెలుసు.
మిథున రాశివారు ద్వంద్వ స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఓ వైపు చురుకుగా ఉంటారు. మరోవైపు చాలా మౌనంగా ఎవరికీ అర్థంకాని వారిలా ప్రవర్తిస్తారు. వీరు మాటలతోనే మాయాజాలం చేయగలరు. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ తో ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు. ఈ మాటలతోనే ఇతరులను ప్రభావితం చేయగలరు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని తమకు అనుకూలంగా మార్చుకోగల సత్తా వీరిలో ఉంటుంది. తాము క్షేమంగా ఉండేందుకు పక్క వారిని సమస్యల్లోకి తోయడానికి కూడా వీరు వెనకాడరు.
మీన రాశిలో పుట్టిన మహిళలు తీవ్రమైన అంతర్ దృష్టిని కలిగి ఉంటారు. వారు చాలా సున్నితంగా ఇతరుల భావోద్వేగాలను గమనించగలుగుతారు. చిన్న విషయాలను కూడా వారు గుర్తించగలుగుతారు. ఇది వారి ప్రత్యేకత. మాయమాటలతో అందరినీ నమ్మిస్తారు. అప్పటికప్పుడు అబద్దాలతో కథలు అల్లగలరు. అబద్ధాలు చెప్పడంలో వీరు నిపుణులు.వీరు చాలా సృజనాత్మకులు, ప్రతిసమస్యకు వినూత్న పరిష్కారాలు ఆలోచించగలరు. వాతావరణానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోగల సామర్థ్యం వీరిలో ఉంటుంది.
తుల రాశికి చెందిన మహిళలు చాలా ఆకర్షణీయంగా, డిప్లమాటిక్ గా ఉంటారు. వాళ్ల మాటలతో, ప్రవర్తనతో చుట్టుపక్కల వారిని సులభంగా ఆకర్షించగలుగుతారు. వారు ఇతరుల అవసరాలు, కోరికలు ఏంటో తక్షణమే అర్థం చేసుకుంటారు. దాంతో పాటు, వాళ్ల ఆలోచనలకు తగినట్లు... ఇతరులను నడిపించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు తాము అనుకున్నది చేయడానికి ఎప్పుడూ ముందుంటారు.
ఫైనల్ గా...
ఈ రాశుల స్త్రీలు తమ తెలివితేటలతో, వ్యూహాత్మకంగా స్పందించే తీరు వల్ల జీవితంలో ఎంతో ముందుకు వెళ్లగలుగుతారు. వారు కావాలని ఇతరులను మోసం చేయరు. కానీ, పరిస్థితుల కారణంగా చేయాల్సి రావచ్చు. ఎవరితో ఎలా, ఎంత వరకు ఉండాలో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వీరికి బాగా తెలుసు.