జోతిష్యశాస్త్రంలో, కొన్ని రాశులకు ఒక దానితో మరొకటి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. వారి ఆలోచనలు, ప్రవర్తన అన్నీ పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. వారి ఆలోచనల్లో తేడా కారణంగా.. వారి మధ్య ఎల్లప్పుడూ గొడవలు, తగాదాలు జరిగే అవకాశం ఉంటుంది.వీరిద్దరూ పక్కనుంటే ఉప్పు, నిప్పు పక్కపక్కన ఉన్నట్లే ఉంటుంది. మరి, ఏయే రాశులకు అస్సలు పడదో ఓసారి చూద్దామా...
27
1.మేషం, వృశ్చికం...
మేషం, వృశ్చిక రాశులు రెండింటికీ ఒక్క నిమిషం కూడా పడదు.ఈ రెండూ రాశులు ఆధిపత్య రాశులే. అన్నింట్లోనూ తమదే పై చేయి ఉండాలని అనుకుంటారు. ఈ కారణంగానే వీరికి ఎక్కువగా గొడవ జరిగే అవకాశం ఉంటుంది. మేష రాశివారు ఏ విషయం అయినా బహిరంగంగా బయటకు చెబుతారు. ఇక.. వృశ్చిక రాశివారు ఏదైనా చాలా రహస్యంగా ఉంచాలి అనుకుంటారు. ఇతరులపై కుట్రలు చేయడంలో ముందుంటారు. ఒకరి ఆలోచనలు మరొకరికి అస్సలు నచ్చవు. వీరు స్నేహితులు అయినా, భార్యభర్తలు అయినా నిత్యం కొట్టుకుంటూనే ఉంటారు.
37
2.వృషభ రాశి, వృశ్చిక రాశి...
వృషభ రాశి, వృశ్చిక రాశి వారికి కూడా అస్సలు పడదు. ఈ రెండు రాశులవారు చాలా మొండిగా ఉంటారు. వృషభ రాశి వారు స్థిరత్వం, సౌకర్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు. కానీ వృశ్చిక రాశివారు మాత్రం మార్పును కోరుకుంటారు. ఈ రెండు రాశుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఈ రాశులవారు ఒకరిని మరొకరు నమ్మలేరు. అందుకే, వీరి మధ్య ఎక్కువగా తేడాలు వస్తూ ఉంటాయి.
మిథునం, ధనుస్సు రెండూ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడే రాశులు. మిథున రాశివారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇక, ధనస్సు రాశివారికి అలా ఊరికే మాట్లాడటం నచ్చదు. చాలా కఠినంగా ఉంటారు. దీని వల్లే.. ఈ రెండు రాశుల మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. ఒకరిని మరొకరు అర్థం చేసుకోలేరు.
57
4.కర్కాటకరాశి, మకర రాశి...
కర్కాటక రాశివారు ఎమోషనల్ గా ఆలోచిస్తారు. మకర రాశివారు ఆచరణాత్మకంగా ఉంటారు. కర్కాటక రాశి సంబంధాలలో బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. కానీ, మకర రాశివారు విజయం, డబ్బుకు మాత్రమే విలువ ఇస్తారు. ఈ తేడాల కారణంగా ఈ రెండు రాశులకు అస్సలు పడదు.
67
5.సింహ రాశి, కుంభ రాశి..
సింహ రాశి, కుంభ రాశి రెండూ స్వార్థంతో కూడిన రాశులు. సింహ రాశివారు అందరి శ్రద్ధను కోరుకుంటారు. కుంభ రాశివారు సమాజ సేవ చేయడానికి ఇష్టపడతారు. వీరి వ్యక్తిత్వాలు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి.. ఈ విషయంలో ఈ రెండు రాశుల వారికి తేడాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
77
6.కన్య రాశి, మీన రాశి..
.
కన్య రాశివారు ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. మీన రాశివారు ఎప్పుడూ ఊహల్లో బతికేస్తూ ఉంటారు. వీరి భావాలు, ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ తేడాల కారణంగా, ఈ రెండూ రాశుల మధ్య నిరంతరం విభేదాలు ఉంటాయి.