2025లో ఈ రాశులకు ఏలినాటి వదులుతుంది, పట్టిందల్లా బంగారమే..!

First Published | Nov 29, 2024, 10:30 AM IST

2025లో శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలో అడుగుపెట్టనున్నాడు. ఈ శనీశ్వరుడు రాశి మార్చుుకోవడం వల్ల  కొన్ని రాశులకు అదృష్టం కలగనుంది. మరి, ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...

శనీశ్వరుడు  ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు. 2025లో కుంభ రాశిలో ఉన్న శని.. మీన రాశిలోకి అడుగుపెడుతున్నాడు. మీన రాశిలోనే దాదాపు రెండున్నరేళ్లు ఉండనున్నాడు. ఈ సంచారం మార్చి 29వ తేదీన జరగనుంది. కాగా, ఈ సంచారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనుంది. వారిని ఇంతకాలం పట్టిపీడిస్తున్న ఏలినాటి శని  వదిలిపోనుంది. కష్టాలు పోయి.. సంతోషాలు రానున్నాయి. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వారి, ఆ అదృష్ట రాశులేంటోచూద్దాం..

కర్కాటక రాశి...

కర్కాటక రాశికి అభివృద్ధి:

కర్కాటక రాశి వారికి అభివృద్ధి కరమైన సంవత్సరంగా ఉంటుంది. శని భగవానుడు మీకు 9వ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలగుతాయి. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. బయట, విదేశాలకు వెళ్లి వస్తారు.


వృషభ రాశి..

వృషభ రాశికి శుభ ఫలితాలు:

వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆఫీసులో పదోన్నతి, జీతం పెరుగుతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటివరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక ఉండదు. వ్యాపారంలో అభివృద్ధి, ఆదాయం పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు.

మకర రాశి..

మకర రాశికి ఏలినాటి శని నుండి విముక్తి:

ఏలినాటి శని నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఇప్పటివరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది. జీవితంలో ఇక మీకు అభివృద్ధే. అభివృద్ధి వైపు ప్రయాణిస్తారు. బ్యాంకు ఋణ సహాయం లభిస్తుంది. కొత్త ఇంటికి మారతారు. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు.

తుల రాశి..

తుల రాశికి విజయాల పరంపర:

శని మీనరాశికి సంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విజయాల పరంపర కొనసాగుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి:

ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది.

Latest Videos

click me!