డిసెంబర్ 2 నుంచి ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే

First Published | Nov 27, 2024, 12:03 PM IST

డిసెంబర్ 2 వ తేదీ నుంచి శుక్ర సంచారం ప్రారంభం కానుంది. కాగా.. ఈ శుక్ర సంచారం కారణంగా 5 రాశులవారు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారట. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

మిథున రాశి..

మిథున రాశివారు డిసెంబర్ 2 తర్వాత నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి వ్యాపారాల్లో లాభాలు తగ్గే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఆదాయం తగ్గి, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువౌతుంది. పని భారం వల్ల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. యోగా, ధ్యానం, ప్రాణయామం లాంటివి చేస్తూ.. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి..

శుక్ర సంచారం కర్కాటక రాశి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అజాగ్రత్త వల్ల ఎముకలు, నొప్పుల సమస్యలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం కాదు. భాగస్వాములతో విభేదాలు రావచ్చు.
 


వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త ఉద్యోగం వెతుక్కోవడం మంచిది. వ్యాపారులు వ్యాపారం మార్చుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం జాగ్రత్త.
 

ధనస్సు రాశి

శుక్ర ప్రభావంతో ధనుస్సు రాశి వారికి మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కుటుంబ జీవితంలో గొడవలు, వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు కష్టకాలం. ఆరోగ్యం జాగ్రత్త.
 

కుంభ రాశి..

శుక్ర సంచారం వల్ల కుంభ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కానీ ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త ప్రణాళికలు అమలు చేయాలి. ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

Latest Videos

click me!