మేష రాశి:
మేష రాశి వారు నిత్యం కోపంతో ఊగిపోతుంటారు. చిన్న చిన్న వాటికే చిరాకు పడుతుంటారు. దీనికి కారణం అంగారక గ్రహమని పండితులు చెబుతున్నారు. మేష రాశికి అధిపతి అయిన అంగారకుడి ప్రభావంతో ఈ రాశి వారు కోపిష్టులుగా ఉంటారు.
ఈ రాశి వారికి కోపం వస్తే అంత సులభంగా శాంతింపజేయలేము. అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు. కోపం వస్తే తమను తాము కంట్రోల్ చేసుకోలేరు.