సంఖ్యాశాస్త్రం ప్రకారం 35 ఏళ్ల తర్వాత అపారమైన డబ్బు సంపాదించే వారి మూల సంఖ్య 8. ఈ మూల సంఖ్య కలిగిన వ్యక్తులు చాలా బలమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటారు. ఏ కఠిన పరిస్థితినైనా ఎదుర్కొనే అపారమైన సామర్థ్యం వారి సొంతం. కుటుంబం, సమాజం పట్ల బలమైన బాధ్యత ఉంటుంది.
ఈ సంఖ్యకు అధిపతి శని
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 8 అధిపతి శని. కర్మ అధిపతి, న్యాయ దేవుడు. కాబట్టి, 8 మూల సంఖ్య ఉన్నవారు తమ కర్మ ఫలితాలను అనుభవిస్తారు. వీళ్లు చాలా కష్టజీవులు. విజయం సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తారు.
ఓపిక, స్థిరత్వం వీరి సొంతం..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 8. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఓపిక, స్థిరత్వం కలిగి ఉంటారు. వారు చాలా కాలం పాటు ఒకే పనిపై దృష్టి పెడుతారు. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు..
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 8.. శని గ్రహానికి సంబంధించింది. దీన్ని నెమ్మదిగా ఫలితాలనిచ్చే గ్రహంగా భావిస్తారు. కాబట్టి 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది. కానీ, ఆ తర్వాత వారు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోరు.
ఆలస్యంగా విజయం..
కృషి, స్థిరత్వం ఈ తేదీల్లో పుట్టిన వారికున్నమంచి లక్షణాలు. వీరు చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఈ సంఖ్య ఉన్నవారు ఆలస్యంగా విజయం సాధించినప్పటికీ.. దాన్ని సాధించినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. వీరు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. సాధారణంగా వీరు తమ కృషితో అపార సంపదను ఆర్జిస్తారు. అది చాలా తరాల వరకు ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
పేదలకు సేవ చేయాలి..
సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరు పేదలకు సేవ చేయాలి. దీనివల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. జీవితం ధన్యమవుతుంది. దీనివల్ల ఇతర గ్రహాలు కూడా శాంతించి.. వారి కర్మ ప్రకారం మంచి ఫలితాలను ఇస్తాయి.