Horoscope Today : ఈ రోజు ఈ రాశివారికి డబ్బే డబ్బు..

Published : May 03, 2022, 06:36 AM IST

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

PREV
113
Horoscope Today : ఈ రోజు ఈ రాశివారికి డబ్బే డబ్బు..
Daily Horoscope 2022 - 06

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   9949459841

213
Representative Image: Aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 
గౌరవం. అన్నిపనులకు అనుకూలం. విద్య, ఉద్యోగ, వ్యాపారములయందు లాభం. కుటుంబంతో అనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలగును.  ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తిలో ఒత్తిడి ఉన్నా ఫలిత౦ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలు పాటించండి. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.

313
Representative Image: Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  
శుభ వార్తాశ్రవణం. ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు.  ఊహించని విధంగా ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తు౦ది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. దాదాపు అన్నిటా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో కొద్దిగా మోసపోయే ప్రమాదం ఉంది.  ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.

413

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  
కుటుంబంతో అనందంగా గడుపుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధువులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.  ప్రయాణాలు. కొత్త  వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

513

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 
శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు.  ఒక ప్రధాన కుటుంబ సమస్యకు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.గౌరవ ప్రతిష్ఠలు కల్గును. మంచి పనులను చేస్తారు. సర్వకార్య సిద్ది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను

613

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-
గౌరవం. అన్ని పనులకు అనుకూలం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కుటుంబంతో అనందంగా గడుపుతారు.  నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఓ వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త, తిప్పట ఎక్కువగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలగును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.

713

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 
శుభ వార్తాశ్రవణం .ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికార యోగానికి కూడా అవకాశ౦ ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నమ్మించి మోసగించేవారితో జాగ్రత్త. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. హుందాతనంగా ఉంటారు. ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను. 

813

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 
కుటుంబంతో అనందంగా గడుపుతారు. కుటుంబపరంగా సమస్యలున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. డబ్బు జాగ్రత్త. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాలు. కొత్త  వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

913

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 
అనవసరఖర్చులుచేస్తారు. పట్టుదలగాఉంటారు. అకారణంగాకోపంవచ్చును.  ఉద్యోగంలో కొన్ని అనుకోని చిక్కులు ఎదురవుతాయి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. సొంత నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. నష్టపోయినధనం, వస్తువులుతిరిగిరాగలదు. చేయుపనులనువాయిదావేస్తారు.ఉద్యోగ, వ్యాపారములుమందగిస్తాయి. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను.

1013

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-
గౌరవం. అన్ని పనులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. వివాదాలకు ఇది సమయం కాదు. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంది. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కుటుంబంతో అనందంగా గడుపుతారు. రావలసిన బాకీలు వసూలగును. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.

1113
Representative Image: Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 
శుభ వార్తాశ్రవణం .ధన లాభం. బంధుమిత్రులను కలుస్తారు. కుటుంబంతో అనందంగా గడుపుతారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు అనుకూలమైన సమయం ఇది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ద పెంచాలి. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. భాగస్వామ్యం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.  ఆకస్మిక ప్రయాణాలు. హుందాతనంగా ఉంటారు. ఏ కార్యం తలపెట్టిన సిద్దించును. ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం.ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను. 

1213
Representative Image: Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-
కుటుంబంతో అనందంగా గడుపుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆరోగ్యం మీద కాస్తంత శద్ధ పెంచాలి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.   ప్రయాణాలు. కొత్త  వ్యక్తుల పరిచయాలు. గృహము నందు సుఖవంతంమైన జీవితం. విద్య, ఉద్యోగ, వ్యాపారముల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. ఓం మహాలక్ష్మియై నమః అను మంత్రమును 21మార్లు జపించవలెను.

1313

మీనరాశి ( Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-
అనవసర ఖర్చులు చేస్తారు. పట్టుదలగా ఉంటారు. అకారణంగా కోపం వచ్చును. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి బంధువులతో అనందంగా గడుపుతారు. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండొద్దు. నష్టపోయిన ధనం, వస్తువులు తిరిగి రాగలదు. చేయు పనులను వాయిదా వేస్తారు.ఉద్యోగ, వ్యాపారములు మందగిస్తాయి. ఓం నమఃశివాయ అను మంత్రమును 21మార్లు జపించవలెను.

Read more Photos on
click me!

Recommended Stories