Monthly Horoscope : ఈ మాసం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే...

Published : May 02, 2022, 11:08 AM IST

01-05-2022 నుంచి 31-05-2022 వరకూ మాస ఫలితాలు. జోశ్యుల విజయ రామకృష్ణ, ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   9949459841

PREV
112
Monthly Horoscope : ఈ మాసం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే...
Aries

మేషరాశి (Aries)  అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 
ఈ మాసం మీకు అన్ని విధాలా  యోగదాయకమే. అంతటా విజయం, ధనలాభం. అయితే ఖర్చులు అధికం, వెనకాడవద్దు..అవి ప్రయోజనకరం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. మీరు ఇష్టపడి ఎదురుచూసే పదవులు, బాధ్యతలు వరిస్తాయి. పరిచయాలు బలపడతాయి. కొత్త ఆలోచనలతో కొత్త అవకాశాలు సృష్టించుకుంటారు. గృహం బంధు,మిత్రులతో సందడిగా వుంటుంది. కొంత అనారోగ్యం పీడ ఉన్నా అది కొద్దిపాటి వైద్యంతో వెళ్లిపోయేదే. అయితే కుటుంబంలో కలతలు, మాటకు, మాట రాకుండా చూసుకోండి. పెద్దరికంగా ఉండండి. విలువైన వస్తువుల విషయంలో  జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మీ జోక్యంతో చాలా పనులు సానుకూలమవుతాయి. మీ లేదా మీ కుటుంబ సభ్యుల వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు.  వ్యాపారాలు మామూలుగా  సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో  కాస్తంత జాగ్రత్త అవసరం. అనుకూల ఫలితం కోసం... సర్వకార్యసిద్దికి ఓంనమఃశివాయ అను మంత్రాన్ని 21మార్లు జపించవలెను.

212
Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  
వ్యాపార, సినిమా రంగాల వారికి శుభదాయకం. మీ కష్టం ఫలించే సమయం. మంచి కీర్తి, కావాల్సిన ధనం అందుకుంటారు. అయితే ఎగ్రిమెంట్స్ వంటివి చేయాల్సి వస్తుంది. బాధ్యతగా మెలగాలి. ముఖ్యంగా సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆ ప్రభావం తర్వాత నెలల్లో పడే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. ఖర్చులు విపరీతం. కానీ అందుకు అవసరమైన డబ్బు సమయానికి అందుతూనే ఉంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. వారే మీ పెట్టుబడి. మీరు గతంలో చేసిన దూరాలోచనలు చాలావరకూ ఇప్పుడు లాభిస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే అని అర్దం చేసుకోండి. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు ఉత్సాహాన్నిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టడం మీకు ఆనందం కలిగిస్తుంది.  మీ శ్రీమతి లేదా శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది.  చిరువ్యాపారాలకు ఒడిదుడుకులు తప్పవు. నిరుద్యోగులకు సదవకాశం.   అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాల రోజు వారీ పఠించండి. 

312

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-
ఈ మాసంఈ రాశి వారికి  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందటం తగ్గించుకోండి. స్థిమితంగా ఉంటేనే మీరు చేసే పనులు ముందుకు వెళ్తాయి. గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీ మనో నిశ్చయం మిమ్మల్ని ఓడిపోనివ్వదు. గతంలోని మీ తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. గతి తప్పుతున్న ఖర్చులు అదుపులో పెట్టాలనుకున్నా కష్టం. అయితే పనుల సానుకూలత మీకు ఆనందం కలిగిస్తుంది. అందుకు  మరింత శ్రమించాలి. సన్నిహితుల కలయిక మీకు చక్కటి ఉపశమనం కలిగిస్తుంది.  కొత్త పనులు, వ్యాపకాలు సృష్టించుకుంటారు.మీ దగ్గరకు వచ్చిన అవకాశాలను వదలొద్దు. అవి చిన్నవిగా కనపడినా పెద్దగా మీకు ఫలితాలని ఇస్తాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెట్టే సమయం. కుటుంబ పరంగా కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాల్సిన అవసరం.  చేతి వృత్తుల వారికి వారికి సామాన్యం. శుభకార్యాల ఆహ్వానం అందుకుంటారు. అనుకూల ఫలితాలకు, సర్వ కీడు నివారణకు రోజూ ఉదయం ఓందుర్గాయైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను

412
Cancer

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 
ఈ మాసం మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంది. కాస్త కష్టపడినా పూర్తి స్దాయి విజయం మీదే. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు వస్తుంది. ప్రణాళికలు వేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. మీ  అంచనాలు అద్బుతంగా ఫలిస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గి ప్రశాంతత కలుగుతుంది. దంపతులు ఇద్దరిలో మార్పు వస్తుంది. బ్రహ్మచారులకు వివాహ యత్నాలు చురుకుగా  సాగిస్తారు. మధ్యవర్తులు వలనే పనలు అయ్యే పరిస్దితి కనపడుతోంది. చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పనులు ఈ మాసంలో పూర్తవుతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న ఫలితాలు అందుతాయి. పిల్లల ఆలోచనలు, కదలికలపై దృష్టి పెట్టండి. బాధ్యతలు అప్పగించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.   వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. రవాణా, సేవా రంగాల వారికి పురోభివృద్ధి. జూదాలు, బెట్టింగులు జోలికి వెళ్లే అవకాసం. సాధ్యమైనంత మనోనిగ్రహంతో వాటికి దూరంగా ఉండండి. శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, ఇంట్లో దీపం పెట్టుకోవాలి. 

512
Leo

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- 
ఆశ్ఛర్యకరమైన ఓర్పే మీ కార్యసాధనకు ప్రధానంగా పునాదిగా నిలుస్తుంది. లేకుంటే ఎంత శ్రమించినా ఫలితం వుండదు. పట్టుదలతో యత్నాలు కొనసాగించకపోతే ఈ మాసం చాలా ఇబ్బందులు పడతారు. అదే సమయంలో  ధన సమస్యలెదురవుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించక,  అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తులతో సంభాషిస్తారు. అయితే అనుకోకండా మీ చెవిన పడే ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సాగవు. దంపతుల మధ్య అవగాహన అవసరం. గ్రహాల అనుకూలత వచ్చేదాకా కొన్ని సమస్యలు తప్పవు.  ఇంటి విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. వేడుకకు హాజరవుతారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.  రోజూ వారి ఇంట్లో దీపం పెట్టుకుని లక్ష్మీ అష్టోత్తర పఠనం కలిసొస్తుంది. 

612

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 
ఈ మాసం  మొదట్లో చాలా నిరాశాజనకంగా ఉంటుంది. మీరు అనుకున్నవి ఏమీ కలిసి రావు. ఎంత  శ్రమించినా ఫలితం వుండక ఓ రకమైన నిస్తేజానికి లోనవుతారు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు మీ అదుపులో వుండవు. రాత్రిళ్లు నిద్రపట్టదు. అదే సమయంలో  ఆత్మీయుల సాయం అందుతుంది. ముఖ్యంగా వారి మాట సాయంతో మీ పనులు కాస్తంత ముందుకు వెళ్తాయి. మీరు వద్దనుకున్న వాళ్లే మీకు సాయిం చేస్తారు. మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తారు. అందుకు తగిన  మనోధైర్యంతో ముందుకు సాగండి. అలాగే అవకాసం ఉంటే గృహమార్పు చేయండి.. కలిసివస్తుంది.  పదిహేనో తేదీ దాటాక కాస్తంత పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు కలిసివస్తాయి. విసుగ్గా ఉండక..ఏదో ఒక వ్యాపకం సృష్టించుకోండి. ఎదురుచూస్తున్న వార్త ఈ నెలాఖరకు మీ చెవిన పడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆదాయ,మార్గా3లు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు.  న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. తగు జాగ్రత్త అవసరం. దగ్గరలో ఉన్న దుర్గాలయ సందర్శనం...అలాగే రోజూ ఓందుర్గాయైనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను. శుక్రవారం అమ్మవారికి నైవేదేయం పెట్టుకుంటే అధిక ఫలితం. 

712
Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమ ఫలితాల సమ్మేళనంగా సాగుతుంది. మంచి జరిగిందని ఆనందపడినా వెంటనే కొన్ని సమస్యలు మిమ్మల్ని వెనక్కి లాగి బాదపెడతాయి. అయితే ఆ ప్రతికూలతలెదురైనా అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష చాలా మందికి స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన లేదని బాధపడద్దు. మీ ఖర్చు కొన్ని శభాలు ఇస్తుంది. అలాగే మీ ఇంట్లో  పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేసి ఖర్చుకోసం దాచుకోండి.  కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దేవాలయ సందర్శనం వీలుపడదు. ఆశించిన పదవులు అందవు. మీ  ఆలోచనల్లో మార్పు వస్తుంది. అయితే మీ సంతానం లేదా సోదరులు ద్వారా శుభవార్తలు వింటారు.   స్వల్ప అస్వస్థతకు గురైనా కంగారుపడద్దు. అతిగా శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. చక్కటి  విశ్రాంతి అవసరం. వ్యాపారాలు అద్బుతంగా సాగవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం దెబ్బకొడుతుంది. ఆచి తూచి అడుగేయండి . ఓ  వేడుకకు హాజరవుతారు అక్కడే మీకు మేలు జరిగేందుకు బీజాలు పడతాయి. అనుకూల ఫలితాలకు, అశుభాలు తప్పుకునేందుకు గానూ ...సాధ్యమైన మేరకు , శివాలయ దర్శనం , అభిషేకం అవసరం. ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను. 

812
Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 
ఆర్థికంగా నిలదొక్కుకునే మాసం ఇది. ఎటుచూసినా మీకు శుభ సూచనలే కనిపిస్తున్నాయి. మీకు అన్ని రకాలుగా  పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమించటమే మీ విజయానికి మూల కారణం అవుతుంది. అకాలభోజనం, శ్రమ అధికం పెట్టుకోవద్దు. మీ పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆదాయం అదే స్దాయిలో ఉంటుంది కాబట్టి సమస్య అనిపించదు. కుటుంబ సభ్యుల సహకారం మీకు ప్రయోజనకరం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. మీ శ్రీమతి లేదా శ్రీవారికు అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. లేకపోతే మాట తేడా , గృహంలో వివాదాలు వచ్చే అవకాసం. వ్యాపకాలుతో పరిచయాలు విస్తరిస్తాయి. పదవుల కోసం యత్నాలు మొదలెడతారు. ప్రత్యర్థులతో  కాస్తంత జాగ్రత్త. నమ్మకంగా ఉండే వారే మోసం చేసే అవకాసం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు స్థానచలనం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం మీకు ఆనందం కలిగిస్తుంది. అనుకూల ఫలితాలకు, అశుభాలు తప్పుకునేందుకు గానూ ... శుక్రవారం కామాక్షి అమ్మవారి పూజ మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. 

912

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- 
ఈ మాసం కొత్త,పాత సంగమం లాంటింది. కొత్త పనులు ఎక్కువగా మొదలెడతారు. పాతవి పూర్తి చేస్తారు. దాంతో సంఘంలో, స్వగృహంలో, కుల సంఘాల్లో గౌరవం, గుర్తింపు. అయితే కొందరి ద్వేషం వివాదాలు రాజేస్తుంది. కానీ అవేమీ మిమ్మిల్ని వెనక్కి లాగలేవు కాబట్టి తేలిగ్గా తీసుకోండి. నవ్వుతో ముందుకు వెళ్లిపోండి.  కుటుంబీకులు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఎదురుచూస్తున్న వేడుకకు హాజరు కాలేరు. దాంతో బంధుమిత్రులతో పట్టింపులెదురవుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే అని అర్దం చేసుకోండి. అతి  త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీదైన మనుష్యులను, ప్రపంచాన్ని సృష్టించుకోండి. అతిగా ఆలోచించవద్దు. మీ విజయంతో  మీ  కుటంబ సభ్యుల వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి.  వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రయాణం తలపెడతారు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఆశావహ దృక్పథమే మిమ్మల్ని గెలిపిస్తుంది.  యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. అనుకూల ఫలితాలకు, అశుభాలు తప్పుకునేందుకు గానూ ...శివాభిషేకాలు చేయించుకోవాలి. శివుడుని నిరంతరం తలుచుకుంటూ ఉండాలి. 

1012
Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :-  
ఈ మాసంలో కార్యసిద్ధి. మీరు అనుకున్న పనులు చాలా వేగంగా పూర్తవుతాయి. అప్పటిదాకా కాని పనులు సైతం ఒక కొలిక్కి వచ్చేస్తాయి. అయితే కొన్ని అవరోధాలు తప్పవు. అవి చిన్నవే. కొద్ది పాటి ఓర్పు,నేర్పు ప్రధానం. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చేతిలో డబ్బు ఆడుతోంది కదా అని  పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు సానుకూలమవుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది.  ఇంటిలో వివాహం జరిగే అవకాసం. ఉద్యోగ, లేదా వ్యాపార ఒప్పందాల్లో మెలకువ వహించండి. కంగారుగా తీసుకునే అనాలోచిత నిర్ణయాలు తగవు. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పాత పరిచయస్తులను కలుసుకుని గతాన్ని తలుచుకుని ఆనందిస్తారు. ఇంట్లో జరిగే కొన్ని  సంఘటనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.  సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా కలిసి వస్తుంది. అనుకూల ఫలితాలకు, అశుభాలు తప్పుకునేందుకు గానూ .. రోజూ .ఓంనమఃశివాయఅనుమంత్రమును21మార్లుజపించవలెను. సోమవారం పూట  కనీసం ఒకరికైనా భోజనం పెట్టుకోవాలి. 

1112

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- 
అకాలభోజనం, శ్రమ అధికం. పనులు మాత్రమం విజయవంతం.ఈ మాసం మీకు గుర్తిండిపోయే నెల అవుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ  మాటకు విలువ, ఆమోదం లభిస్తుంది. మీ కుటంబ సభ్యులకు అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకోవద్దు. మీ శక్తి అవతలివాళ్లకు అర్దమయ్యే మీ దగ్గరకు వస్తున్నారని అర్దం చేసుకోండి. అందరూ పైకి చెప్పరు. కానీ మీ మీద వాత్సల్యం, ప్రేమ ఉంటుంది. మీరు ఎక్కువగా చిన్న చిన్న విషయాలకు స్పందించటం మానేయండి. అఫ్పుడే మీ వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. పదవుల కోసం మీరు సాగిస్తున్న యత్నాలు కలిసి వస్తాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ ఎక్కువగా విశ్వసించవద్దు. వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు శుభయోగం.  ఈ రోజు శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి.అనుకూల ఫలితాలకు, అశుభాలు తప్పుకునేందుకు గానూ ... రోజూ వారి  ఓంసుబ్రహ్మణ్యాయనమఃఅనుమంత్రమును21మార్లుజపించవలెను.నియమంతో సుబ్రమణ్య ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. 

1212
Pisces

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  
శుభవార్తాశ్రవణం. ధనలాభం. బంధుమిత్రులనుకలుస్తారు.కుటుంబంతో అనందంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దాంతో మిమ్మల్ని సమాజంలో గుర్తిస్తారు. అయితే మీ మంచితనం, మాట తీరుకు కొందరు ఆకర్షితలు అవుతారు. వారి వల్ల మీకు సమస్యలు వస్తాయి. కొన్ని సమయాల్లో కటువుగా లేకపోతే ఫలితం లేదని గ్రహించండి. పిల్లలను కూడా మందలించాలి. లేకపోతే వారి జీవితాల్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రభావం కుటుంబం మొత్తానికి ఇబ్బంది కరంగా మారుతుంది.  మీరు చాలా విషయాల్లో ఆందోళనగా ఉంటూ వస్తున్నారు. అవి ఈ నెలలో మాయమయ్యే అవాకాసం ఉంది. గ్రహసంచారం అనుకూలంగా మారుూతోంది.  ఖర్చులు పెరిగిపోయినా ప్రయోజనకరం. పనుల సానుకూలతకు మరింత కష్టపడాల్సిందే. ఒక సమాచారం ఆలోచింపడేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.  విద్యాసంస్థలకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అనుకూల ఫలితాలకు, అశుభాలు తప్పుకునేందుకు గానూ ...రోజూ వారి ఓంనమోనారాయణాయ అనుమంత్రమును21మార్లుజపించవలెను. విష్ణుమూర్తి అనుగ్రహం కోసం వెంకటేశ్వరస్వామి దేవాలయాలు లేదా శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాలకు వెళ్లటం మేలు.

click me!

Recommended Stories