మే నెలలో మీరు ప్రేమలో పడతారా? బ్రేకప్ చేసుకుంటారా? మీ రాశి చక్రం ఏం చెబుతుందంటే....

Published : May 02, 2022, 01:24 PM IST

ఒక చిన్న పొరపాటు..అనుమానం.. మీ ప్రేమ బంధాన్ని ఇరకాటంలో పడేస్తుంది. అయితే మీ రాశిచక్రం ఆధారంగా మే 2022లో మీ లవ్ లైఫ్ ఎలా వెళ్లబోతోందో... జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు 

PREV
112
మే నెలలో మీరు ప్రేమలో పడతారా? బ్రేకప్ చేసుకుంటారా? మీ రాశి చక్రం ఏం చెబుతుందంటే....

మేషం
ఈ నెలలో మేషరాశివారికి వివాహం అయ్యే అవకాశాలున్నాయి. . అరెంజ్ డ్ మ్యారేజో, లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు. వివాహితులైతే వారి సంబంధం ఇంకా మెరుగవుతుంది

212

వృషభం
మే నెలలో వృషభరాశివారు భాగస్వామితో విడిపోయే అవకాశాలున్నాయి. నమ్మకద్రోహం దీనికి కారణం కావచ్చు. మనసును విపరీతంగా బాధిస్తుంది. కానీ, ఇలాంటి బాధాకరమైన సంబంధానికి దీనివల్లే దూరంగా ఉండగలుగుతారు.

312

మిథునం
ఈ నెలలో మిథున రాశివారు తమ భాగస్వామితో కలిసి సమయాన్ని గడుపుతారు. ఇద్దరూ ఇష్టపడే కార్యకలాపాలలో పాల్గొంటారు. ప్రేమ పెరుగుతుంది. బంధం బలపడుతుంది.

412

కర్కాటకం
ఈ నెలలో కర్కాటక రాశివారు రిలేషన్ నుండి దూరంగా పోతున్నట్లుగా అనిపిస్తారు. ఏవేవో కారణాలు చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామితో చర్చించకుండా ఎలా రిలేషన్ నుంచి బయటపడదామా అని చూస్తారు. 

512

సింహం 
సింహరాశివారికి ఈ నెలలో వివాహం జరిగే అవకాశాలున్నాయి. పెళ్లి సెటిల్ అవ్వడం, పెళ్లి పనులు ప్రారంభించండం..లేదా పెళ్లి జరగడం అవుతుంది. 

612

కన్య
కన్యారాశివారు ఈ నెలలో కొత్త రిలేషన్ లోకి వెడతారు. ఇక మీకు పూర్తిగా వ్యతిరేక స్వభావం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. అది ఇష్టపడి చేసుకునే పెళ్లి కాకపోయినా విధిరాతతో ముడిపడే బంధం. 

712
Libra

తులారాశి
ఈ నెలలో తులారాశి మీ భాగస్వామితో గొడవలు లేదా వాదనకు దిగవచ్చు. చాలా మంది వ్యక్తులు మీ సంబంధాన్ని లేదా వివాహాన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయి. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నెరవేరుతుంది 

812
Scorpio

వృశ్చిక రాశి
ఈ నెలలో మీరు మీ భాగస్వామిని ఎక్కువసార్లు కలుసుకుంటారు. దీంతోపాటు రిలేషన్ లో సిక్త్ సెన్స్ ను ఎక్కువగా వాడతారు.

912

ధనుస్సు
ఈ నెలలో మీ సంబంధంలో చాలా ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల బంధంలో ఒడిదుడుకులు వస్తాయి. వాటినుంచి బయటపడలేకపోవచ్చు. దీన్నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. 

1012

మకరం
ఈ నెలలో మీరు బాండ్‌ను మరింత పటిష్టం చేసుకోవడానికి మీ భాగస్వామికి డబ్బు లావాదేవీలను కలిగి ఉండే అదనపు కార్యక్రమాలను తీసుకుంటారు. ఇది విహారయాత్రకు ప్లాన్ చేయడం, తేదీకి వెళ్లడం, బహుమతులు కొనడం లేదా బాండ్ పెరగడానికి సహాయపడే ఏదైనా ఇతర విషయాలపై పెట్టుబడి పెట్టడం కావచ్చు. సింగిల్స్ సరైన మ్యాచ్‌ను కనుగొనాలనే ఆశతో వారి ఆర్థిక స్థితిని ప్రదర్శించడం ద్వారా ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.

1112

కుంభం
ఈ వారం మీరు మీ ప్రేమ జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. సింగిల్ పర్సన్స్ కు రిలేషన్ కష్టం అవుతుంది. ఇక ఇప్పటికే రిలేషన్ లో ఉంటే ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా బయటపడొచ్చు. ఈ సమస్యలు తాత్కాలికమైనవి. త్వరలో తొలగిపోతాయి.
 

1212


మీనం
ఈ నెలలో మీరు మీ సంబంధాన్ని కొత్తగా ప్రారంభిస్తారు. గతంలో వచ్చిన సమస్యలన్నీ తొలగిపోతాయి. రాబోయే నెలల్లో సంబంధాలలో మెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుత సంబంధం ముగిసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశివారు 2022 మే నెలలో కొత్త సంబంధాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories