Horoscope Today : ఈ రాశి వారు రిస్క్ ఉండే పనులు చేయకండి, జాగ్రత్త అవసరం

Published : May 15, 2022, 07:00 AM IST

Horoscope Today :  రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాల్లో తెలుసుకుందాం  

PREV
113
Horoscope Today : ఈ రాశి వారు రిస్క్ ఉండే పనులు చేయకండి, జాగ్రత్త అవసరం
Aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 
 
శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.  బంధుమిత్రులతో సంతోషంగా గడిపే సమయం. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

213
Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

పూర్తి అనుకూలమైన రోజు. వృత్తి,వ్యాపారాలలో తిరుగులేదు. పెండింగ్  రావలసిన బకాయిలు వసూలగును. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

313
Gemini

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

మీరు ఊహించని శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
 

413

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన రోజు.  నిత్యం చేయు పనులో కూడా  ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

513
Leo

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

మీరు కొంచెము కూడా ఊహించని ఖర్చులు. ముఖ్యమైన పనుల యందు కూడా నిరాసక్తత. అకారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

613

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండండి. సభ్యుల మధ్య అవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. ఎంతో కష్టపని చేసిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

713
Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

కంగారుపడకండి..ఈ రోజు కాస్త అననుకూలమే. మీరు చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

813
Scorpio


వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

అదృష్టమైన రోజు. మీకుటంబం సంతోషానికి పర్యాయపదంలా కనపడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది.
 

913
Sagittarius

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

ఓపిక పట్టాల్సిన రోజు. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువగా కష్టపడతారు. అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ.పనుల యందు నిరాసక్తత. అకారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

1013
Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

మీరు ఈ రోజు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు. చేసే వ్యాపారాల యందు ధనలాభం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

1113

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. అనవసరమైన ఆలోచనలు చేయకండి ఉపయోగం లేదు. ఇతరులసహాయం తీసుకుంటారు.నామోషి పడకండి. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

ఈ రోజుని మీరు ఎక్కువగా ఇంటివద్దనే గడపండి..కుటుంబ సబ్యులతో నోరు జారకండి. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.
 

1313
astrology

పంచాగం

15 మే 2022 ఆదివారం

శుభ కృత నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
శుక్లపక్షం
చతుర్దశి పగలు11:35ని‌.ల వరకు తదుపరి పూర్ణిమ
స్వాతి నక్షత్రం మధ్యాహ్నం.03:11 ని|| వరకు
వర్జ్యం రా.08:32ని.ల లగాయతు రా.10:03ని.లవరకు
దుర్ముహూర్తం ఉదయం4:36ని. లగాయతు 05:27ని.ల వరకు 
రాహుకాలం సాయంత్రం 04:30ని.ల లగాయతు సాయంత్రం 06:00ని.ల వరకు
యమగండం మధ్యాహ్నం 12:00ని.ల లగాయతు సాయంత్రం.01:30ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:32ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:19ని.లకు.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Read more Photos on
click me!

Recommended Stories