Horoscope Today : ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం బాగుంటుంది, పాత రుణాలు తీరుస్తారు..!

First Published May 14, 2022, 6:32 AM IST

మే 14 , శనివారం 2022  మీ  రాశి ఫలాలు...రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

Aries

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- 

 ఉద్యోగులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. కోర్టు వ్యవహారాలు అనుకూలం.   బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. కారణంగా కోపం. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.

Taurus

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

చేయు పనులయందు ఆలస్యం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహరాల్లో మెలకువ వహించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

Gemini

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించి న శుభం జరుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

శుభవార్తలు వింటారు.    సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

Leo

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

అన్ని పనులకు అనుకూలం. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్య ఇబ్బందులు. ఉద్యోగులకు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోగొట్టు పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

কন্যা রাশি (Virgo)

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

అవసరమైన గొడవలు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన అవసరం..లేకుంటే చిక్కులు. మీ కళత్ర మొండి వైఖరి వల్ల ఇబ్బందులు. దైవ సేవా కార్యక్రమాలలోచురుకుగా పాల్గొంటారు.మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.

Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

చేయి పనులయందు ఆటంకములు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమించి అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. మిత్రులతో గొడవలు. పెద్ద వారితో చర్చలు. కష్టించిన పనిలో విజయం సాధిస్తారు. శారీరక శ్రమ. మానసిక ఒత్తిడి. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును.

Scorpio

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో ఊహించని అవకాశాలు లభిస్తాయి.అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.

Sagittarius

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

అన్ని పనులకు అనుకూలం. కష్టపడి చేసిన పనికి ప్రతిఫలం లభించును. నిత్యావసర వస్తుస్టాకిస్టులు, వ్యాపారులకు కలిసిరాగలదు. ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం మంచిది. కొన్ని సమస్యలతో అనవసరమైన ఆలోచనలు చేస్తారు. బంధు మిత్రులను కలుస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. పోయిన వస్తువు తిరిగి లభించును. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ వ్యాపారస్తులకు సామాన్యం. ఓం నమశ్శివాయ అనే మంత్రమును 21 మార్లు జపించి సభ జరుగును.

Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

శుభవార్తలు వింటారు. వ్యాపారాల యందు ధనలాభం. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. ఓం నమో నారాయణాయ అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. , కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు ,స్పర్దలు. అధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.

Pisces

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు.ప్రైవేటు సంస్థలలో వారికి తోటివారి కారణంగా సమస్యలు. స్త్రీలకు సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పండ్ల, పూల, చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. పాత రుణాలు తీరుస్తారు. అనవసరమైన ఖర్చులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. క్రయ విక్రయాల యందు తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారాల యందు సామాన్యం. ఓం ఆంజనేయాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును.

astrology

పంచాంగం

14 మే 2022 శనివారం

శుభ కృత నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
శుక్లపక్షం
శని త్రయోదశి మధ్యాహ్నం01:25ని‌.ల వరకు తదుపరి చతుర్దశి
చిత్త నక్షత్రం మధ్యాహ్నం.03:58 ని|| వరకు
వర్జ్యం రా.09:23ని.ల లగాయతు రా.10:56ని.లవరకు
దుర్ముహూర్తం ఉదయం5:03ని. లగాయతు 07:14ని.ల వరకు 
రాహుకాలం ఉదయం 19:00ని.ల లగాయతు మధ్యాహ్నం 10:30ని.ల వరకు
యమగండం మధ్యాహ్నం 01:30ని.ల లగాయతు సాయంత్రం.03:00ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:32ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:19ని.లకు.

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!