Published : May 14, 2022, 10:29 AM ISTUpdated : May 14, 2022, 10:44 AM IST
జూమ్ కాల్స్.. కరోనా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా జూమ్ కాల్స్ చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్లవరకు అందరికీ అలవాటయ్యింది. అయితే జూమ్ కాల్స్ లో ప్రతీ ఒక్కరూ వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. ఇదంతా వారి వారి రాశుల ప్రభావమేనట..
మేషరాశి (Aries) : జూమ్ మీటింగ్ లో జాయిన్ అవుతూనే.. తమ ఆలోచనలను ఒకదానివెనక ఒకటిగా చెప్పుకుంటూ పోతుంటారు.
212
వృషభరాశి ( Taurus) : వీళ్లు చాలా కామ్ గా ఉంటారు. అన్ని విషయాలు తెలుస్తాయి. వారు పనికి సంబంధించిన రిపోర్టులు పూర్తిచేసి, వాటిని సకాలంలో సమర్పించి ప్రశంసలు కూడా పొందుతారు.
312
మిధునరాశి ( Gemini) : జూమ్ కాల్ సమయంలో బాగా నెర్వస్ గా ఫీలవుతారు. ఎందుకంటే డెస్క్ టాప్ మీద వీరు జూమ్ కాల్ తో పాటు మరో టాబ్ లో పనిచేస్తూ ఉంటారు.
412
కర్కాటకరాశి ( Cancer) : ఏదైనా ప్రజంటేషన్ ఇచ్చేముందు తమ కొలిగ్స్, మిగతా ఎంప్లాయిస్ కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకుంటారు.
512
సింహరాశి (Leo) : వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అయినా సరే ఎదుటివాళ్లనుంచి ప్రశంసలు అందుకోవాలని చూస్తారు. అది జూమ్ మీటింగ్ అయినా సరే.
612
కన్యారాశి ( Virgo) : వీళ్లు పెద్ద వర్క్ హాలిక్స్. జూమ్ మీటింగ్ సమయంలో అవసరమైన ప్రతీ విషయం తమ మౌస్ కి ఒక క్లిక్ దూరంలో ఉండాలని కోరుకుంటారు.
712
తులారాశి ( Libra) : వీళ్లు మిగతా వారికి చాలా స్పూర్తిదాయకంగా ఉంటారు. అందరి గురించీ ఆలోచిస్తారు. మీటింగ్ ను హుందాగా నిర్వహించే సామర్థ్యం వీరి సొంతం.
812
వృశ్చికరాశి ( Scorpio) : మనుషులకు ఎదురుపడడం కంటే జూమ్ మీటింగ్స్ లో కలుసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు వీరు ప్రతీ ఒక్కరినీ జడ్జ్ చేస్తుంటారు.
912
ధనుస్సురాశి ( Sagittarius) : వీరి నోరు చాలా పెద్దది. జూమ్ మీటింగ్ జరుగుతున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.
1012
మకరరాశి ( Capricorn) : వీళ్లు మల్టీ టాస్కర్లు... జూమ్ కాల్ లో అన్ని విషయాల్నీ బాగా మేనేజ్ చేయగలుగుతారు.
1112
కుంభరాశి (Aquarius) : వీళ్లకు చాలా మంచి ఆలోచనలు ఉంటాయి. తమదైన స్థానంలో ఉన్నట్లైతే వారు జూమ్ కాల్ మీటింగ్ ను బాగా ఇష్టపడతారు.
1212
మీనరాశి ( Pisces) : నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లైతే జూమ్ కాల్ మీటింగ్ లో ఉండడానికి ఇష్టపడరు. వెంటనే మీటింగ్ నుంచి వెళ్లిపోయి.. కొత్త ఆలోచనలతో మళ్లీ తిరిగి వస్తారు.