1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. 1 రాడిక్ సంఖ్య కలిగిన వ్యక్తులు సహజంగానే ఆత్మవిశ్వాసం అధికంగా కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వం కూడా చాలా బలంగా ఉంటుంది. వీరు త్వరగా ప్రజల్ని ఆకట్టుకుంటారు. అలాగే ఇతరుల చేత గౌరవాన్ని పొందుతారు. వీరు నిరంతరం జీవితంలో ఉన్నత స్థానాలను సాధిస్తూనే ఉంటారు. వీరికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. వీరు ధైర్యవంతులు, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు.
ఒకటి మూల సంఖ్య కలిగిన వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకోరు. ఏ స్థితిలోనైనా తమను తాము ప్రేరేపించుకుంటారు. ఎక్కడికి వెళ్లినా నాయకత్వ పాత్రనే పోషిస్తారు. వీరికి ఆత్మగౌరవం కూడా బలంగా ఉంటుంది. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి వీరికి ఉంటుంది.