Zodiac signs: 2026 లో ఈ మూడు రాశులకు జాక్ పాట్, ధనవంతులు అవ్వడం ఖాయం!

Published : Nov 10, 2025, 05:20 PM IST

Zodiac signs: 2026 లో శని, బుధ కలయిక జరగనుంది. వేద జోతిష్యశాస్త్రంలో ఈ కలయిక చాలా శక్తివంతమైనది. దీని కారణంగా మూడు రాశులకు అదృష్టం పెరగనుంది. వారు పట్టిందల్లా బంగారమౌతుంది. 

PREV
14
శని, బుధుడి కలయిక....

జోతిష్యశాస్త్రం ప్రకారం, 2026లో అనేక శుభ గ్రహాల కలయికలు ఏర్పడతాయి. వీటిలో న్యాయమూర్తి శని, వ్యాపార దేవుడు బుధుడు కూడా ఉన్నాయి. బుధుడు శని కలయిక 2026 ప్రారంభంలో జరుగుతుంది. శని, బుధుడు కలయిక దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ముఖ్యంగా మూడు రాశుల అదృష్టం పెరుగుతుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా....

24
వృషభ రాశి....

వృషభ రాశి వారికి బుధుడు, శని కలయిక ప్రయోజకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఈ కలయిక మీ రాశి వారికి చాలా అనుకూలమైన భాగంలో ఉంటుంది. కాబట్టి, మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. దీనితో కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. ఈ కాలంలో, మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీ నుంచి ప్రయోజనం పొందుతారు. పిల్లలు కూడా పురోగతి సాధించవచ్చు. వృత్తి జీవితంలో గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మీ కుటుంబంలో , సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. దీని కారణంగా మీ మాటలకు అందరూ ఆకర్షితులౌతారు.

34
మకర రాశి...

బుధుడు, శని కలయిక మీ రాశి చక్రంలోని రెండో ఇంట్లో సంభవిస్తుంది. కాబట్టి, మకర రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలను పొందుతారు. ఇది మీ స్నేహితుల సర్కిల్ ని పెంచుతుంది. రచన, కమ్యూనికేషన్, మీడియాకి సంబంధించిన వ్యక్తులకు ఇది చాలా మంచి సమయం. ఈ సమయంలో విశ్వాసం, విజయం, ధైర్యం పెరుగుతాయి. దీనితో మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా పనిని పూర్తి చేయగలరు. కొత్త ఉద్యోగం, వాహనం లేదా ఆస్తిని పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరతాయి.

44
మీన రాశి...

బుధుడు , శని కలయిక మీన రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కలయిక మీ రాశి వివాహ గృహంలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీ విశ్వాసం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీ సామాజిక వృత్తం కూడా విస్తరిస్తుంది, ఇది మీకు గౌరవం , ప్రతిష్టను ఇస్తుంది. వివాహితులకు అద్భుతమైన వైవాహిక జీవితం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఈ సమయం వారి కెరీర్‌లో కొత్త ఎత్తులకు చేరుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఫలితంగా, సంపద పెరిగే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories