2026 కొత్త ఏడాది నడుస్తోంది. జ్యోతిష్యులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఎన్నో రాశుల వారి జీవితాల్లో మార్పులు, కొత్త అవకాశాలు వస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ ఏడాది శని, రాహు, కేతు, కుజ, గురు గ్రహాల స్థానాలు మారతాయి. దీని ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఒడిదొడుకులు పెరుగుతాయి.
జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం ఈ ఏడాది గురు గ్రహం రెండుసార్లు తన గమనాన్ని మార్చుకుంటాడు. మొదట కర్కాటక రాశిలోకి, తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారి స్థితులపై ప్రభావం పడుతుంది. రాహు, కేతువుల ప్రభావం కూడా కొన్ని రాశులపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ గ్రహ సంచార ప్రభావం సింహ, కుంభ రాశులపైనే అధికంగా ఉంటుంది.