Telugu

నిమ్మకాయతో సులువుగా శుభ్రం చేసే ట్రిక్స్

Telugu

ఫ్రిజ్

నిమ్మకాయతో ఫ్రిజ్‌లోని దుర్వాసన తగ్గించుకోవచ్చు. నీటిలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లోపల స్ప్రే చేయాలి. ఆ తర్వాత తుడిస్తే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

సింక్‌

సింక్ నుంచి వచ్చే దుర్వాసన, అక్కడ పట్టే మరకలను తొలగించడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి వాడితే ఇంకా మంచిది.

Image credits: Getty
Telugu

మాడిన పాత్రలు

మాడిపోయిన కళాయిలను నిమ్మ తొక్కతో సులభంగా శుభ్రం చేయచ్చు.  నీరు మరిగించి నిమ్మకాయ ముక్కలు వేయాలి. తరువాత ఆ నీటితో పాత్రలు తోమాలి.

Image credits: social media
Telugu

తుప్పు

ఇనుప కళాయిలకు పట్టిన తుప్పును తొలగించడానికి కూడా నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు కలిపి తుప్పు పట్టిన చోట రుద్దాలి.

Image credits: social media
Telugu

కటింగ్ బోర్డు

కటింగ్ బోర్డును శుభ్రం చేయడానికి కొద్దిగా ఉప్పు చల్లి, నిమ్మకాయతో బాగా రుద్ది కడిగితే చాలు.

Image credits: Getty
Telugu

గాజు పాత్రలు

గాజు పాత్రలను శుభ్రం చేయడానికి నీటిలో నిమ్మరసం కలిపి, అందులో గాజు పాత్రను నానబెట్టాలి. తర్వాత బేకింగ్ సోడాతో రుద్ది కడగాలి.

Image credits: Getty
Telugu

గ్యాస్ స్టవ్

బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి స్టవ్‌ పై చల్లించాలి. ఆ తర్వాత నిమ్మతొక్కతో బాగా రుద్ది కడిగితే సరిపోతుంది.

Image credits: Getty

మాంసం ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

వంటకు ఏ నూనె వాడాలో తెలుసా?

రోజూ రెండు లవంగాలు నమిలితే ఏమౌతుంది?

అదిరిపోయే డిజైన్లలో షార్ట్ కుర్తీలు.. కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్