Vastu Tips: చాలామంది మంచం మీద కూర్చుని తింటూ ఉంటారు. వర్క్ ఫ్రం హోం చేసే వారిలో ఎక్కువగా అలవాటు కనిపిస్తుంది. మంచం మీద కూర్చుని తినడం వల్ల వాస్తు ప్రకారం జీవితంలో ప్రతికూలత పెరిగిపోతుంది. కొన్ని రకాల సమస్యలు వస్తాయి.
వాస్తు శాస్త్రం ఇల్లు ఎలా ఉండాలో చెప్పడమే కాదు.. అందులో నివసించే మనుషులు ఎలాంటి పనులు చేయకూడదో కూడా చెబుతుంది. నిద్రపోవడం, తినడం, తాగడం వంటివి కూడా వాస్తు శాస్త్రం ప్రకారమే చేయాలి. నియమాలను పాటించకపోతే మన జీవితాల్లో ప్రతికూలత పెరిగిపోతుంది. ఇక తినడం విషయానికి వస్తే ఎక్కువ మంది సౌకర్యంగా ఉన్న చోట తినేందుకు ఇష్టపడతారు. కొందరు వర్క్ ఫ్రం హోం చేస్తూ మంచం మీదే కూర్చొని పనిచేస్తారు. అలా మంచం మీద తినేస్తూ ఉంటారు. ఇంకొందరు రెస్ట్ తీసుకుంటూ మధ్యలో లంచ్ టైం కి లేచి వెచ్చగా ఉందని మంచం మీదే కూర్చొని తింటూ ఉంటారు. దీనివల్ల ఎంతో హాని కలిగే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
23
లక్ష్మీదేవికి కోపం
మంచం మీద కూర్చుని తినడం అలవాటు ఉంటే వెంటనే మానేయండి. మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ తింటే ఎంతో మంచి ఫీలింగ్ కలుగుతుంది. కానీ అలవాటు మంచి సరైనది కాదు. శాస్త్ర నియమాల ప్రకారం ఇలా చేసే వారిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది. రాహువు వారిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాడు. అలాంటి వ్యక్తుల ఇంటిలో పేదరికం వచ్చే అవకాశం ఉంది. డబ్బు కూడా విపరీతంగా కోల్పోవచ్చు. అలాగే మనసుకు శాంతి ఉండదు. నిద్ర కూడా సరిగా పట్టదు. ఇంట్లో సరైన స్థలంలో సరైన దిశలో కూర్చుని తినడమే మంచిది.
33
ఏ దిశవైపు కూర్చుని తినాలి?
మంచం మీద తినకూడదు సరే మరి ఏ దిశలో కూర్చుని తింటే మంచిదని కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆహారం తినేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టుకొని కూర్చోవడం మంచిది. అలా చేయడం వల్ల మన ఆహారంతో పాటు మంచి శక్తిని కూడా స్వీకరిస్తాము. ఆహారం తినడానికి ఉత్తమ మార్గం నేలపై కూర్చుని తినడమే. నేలపై కూర్చుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం తినేటప్పుడు ఈ వాస్తు పద్ధతులు పాటించాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.