Zodiac signs: ఈ రాశుల వారికి 30 ఏళ్ల వయసు దాటాక చంద్రుడి వల్ల రాయల్ లైఫ్

Published : Nov 07, 2025, 09:56 AM IST

Zodiac signs: జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు ముఖ్యమైన గ్రహం. చంద్రుడి వల్ల కాకల యోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి 30 ఏళ్ల తర్వాత రాజయోగం దక్కుతుంది. వారి జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది.

PREV
16
చంద్రుడి వల్ల కాకల యోగం

జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు ముఖ్యమైన గ్రహంగా చెబుతారు. చంద్రుడు మానసిక స్థితి, శాంతి, కీర్తి కి సూచికగా చెప్పుకుంటారు. చంద్రుడి గమనం వల్ల ఒక్కోసారి కాకల యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 30 ఏళ్ల తర్వాత రాజయోగం దక్కుతుంది. మూడు రాశుల వారికి  ఇవి ఎన్నో ప్రత్యేక ఫలాలను అందిస్తుంది. కాకల యోగం వల్ల ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మంచి స్థాయికి చేరుతుంది.

26
వృషభ రాశి

వృషభ రాశి వారికి చంద్రుడి వల్ల కాకలయోగం ఏర్పడుతుంది. 30 ఏళ్ల తర్వాత వీరికి జీవితంలో పెద్ద పురోగతి సాగుతుంది. వీరి జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులు దక్కుతాయి. చంద్రుని సంచారం వీరికి మనశ్శాంతిని అందిస్తుంది. నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది.  వీరికి వృత్తి, వ్యాపారంలో విపరీతంగా కలిసివస్తుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. 

36
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారిని పాలించేది చంద్రుడు. దీనివల్ల వీరికి కాకల యోగం చాలా బలంగా ఉంటుంది. దీనివల్ల వీరు అదృష్టవంతులు. 30 ఏళ్ల వయసు తర్వాత వీరి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ యోగం వల్ల రాజకీయాలు, ప్రభుత్వ ఉద్యోగం, విద్యా రంగం, వృత్తిపరమైన అభివృద్ధిలో ఎంతో ఉన్నతిని సాధిస్తుంది. ఈ రాశి వారికి గౌరవం, కీర్తి వంటివి పెరుగుతాయి. మీరు అనుకోకుండా కుటుంబంలో నాయకత్వ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది.

46
తులా రాశి

తులా రాశి వారు 30 ఏళ్ల తర్వాత జీవితంలో స్థిరపడతారు. వారు ఆర్ధిక భద్రతను పొందుతారు. వీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  ఆస్తిని కూడబెట్టే అవకాశం ఉంది.  వాహనాలు కూడా అధికంగా ఉంటాయి. సమాజంలో గౌరవం, ధనం పెరుగుతాయి. ఈ రాశి వారు కళ, వాణిజ్యం, అందం, మీడియా రంగాలలో గొప్ప విజయం సాధిస్తారు. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం, సమతుల్యత వంటివి విజయ శిఖరాలకు చేరుతారు.

56
కాకల యోగం వల్ల ఏం జరుగుతుంది

చంద్రుడి వల్ల పైన చెప్పన రాశుల వారికి ఆర్ధికంగా మంచి స్థాయికి చేరుతుంది. వీరికి ఉద్యోగంలో పదోన్నత దక్కే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మనశ్శాంతిగా జీవిస్తారు. వీరికి అన్ని విధాలా అభివృద్ధి కనిపిస్తుంది.

66
ఇలా పూజ చేయండి

కాకల యోగం వల్ల పైన చెప్పిన రాశుల వారు కొన్ని పూజలు చేస్తే మరింత ఆనందంగా ఉంటారు.  పౌర్ణమి రోజులలో చంద్రుడిని పూజిస్తే మంచిది.  నీరు, పాలు, బెల్లం వంటివి దానం చేయడం మంచిది.  రావి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేయడం కూడా మంచిది . చంద్రుడి వల్ల ఏర్పడే కాకల యోగం పైన చెప్పిన మూడు రాశులకు 30 ఏళ్ల తర్వాత రాజయోగాన్ని అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories