అన్నం, చపాతీలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే శరీరానికి శక్తినిస్తాయి, కానీ ఎక్కువగా తింటే అవి కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశం ఉంది.
Image credits: Freepik
Telugu
తెల్ల బియ్యం
తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. మళ్లీ త్వరగా ఆకలి వేస్తుంది. అధికంగా ఆహారం తినేస్తారు.
Image credits: social media
Telugu
చపాతీలో గ్లూటెన్
చపాతీలు చేసే గోధుమపిండిలో గ్లూటెన్ ఉంటుంది. కొందరికి ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం లేదా బరువు పెరిగినట్టు అనిపించవచ్చు.
Image credits: Freepik
Telugu
ఎంత తింటున్నారో చూసుకోండి
అన్నం, చపాతీలు ఎంత తింటున్నారో చూసుకోవడం బెటర్. వాటిని ఎక్కువగా తింటే కేలరీలు పెరిగి బరువు కూడా పెరుగుతుంది.
Image credits: Pinterest
Telugu
ఏం తినాలి?
తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ తింటే మంచిది.
Image credits: Pexels
Telugu
కూరగాయలు తినండి
భోజనంలో కూరగాయలు, పప్పులు వంటివి అధికంగా తినండి. వాటిని సలాడ్ రూపంలో తింటే ఇంకా మంచిది.
Image credits: Pixabay
Telugu
రాత్రి భోజనం ఇలా
ఒకేసారి ఎక్కువ అన్నం లేదా చపాతీ తినొద్దు. రాత్రిపూట తేలికపాటి భోజనం చేయండి.