Zodiac signs: అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఆల్రెడీ మొదలైంది. ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పరమ శివుడిని పూజిస్తూ ఉంటారు. మరి, ఈ నెలలో ఆ మహా శివుడి ఆశీస్సులు ఏ రాశుల వారిపై ఉండనున్నాయో..? ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయో చూద్దాం...
కార్తీక మాసంలో మేష రాశి వారికి సానుకూలంగానే ఉండనుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. భక్తితో నిత్య స్నానం, దీపారాధన చేస్తే ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి.
212
వృషభ రాశి..
కార్తీక మాసంలో వృషభ రాశివారికి శాంతి, స్థిరత్వం పెరుగుతుంది. ఈ సమయంలో వీరు క్రమం తప్పకుండా దీపారాధన , శివపూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో నిలకడ వస్తుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది.
312
మిథున రాశి...
ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మిథున రాశివారికి పెద్దగా కలిసొచ్చేది ఏమీ లేదు. వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యం. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం కాదు. దానికంటే.. ఆల్రెడీ చేస్తున్న పనులను పూర్తి చేయడం మంచిది. శివాలయానికి వెళ్లి... దీపారాధన చేయడం వల్ల జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది.
కర్కాటక రాశివారికి ఈ కార్తీక మాసంలో ధనా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శివాభిషేకం చేయడం ద్వారా పాత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.
512
సింహ రాశి...
సింహ రాశివారికి ఈ కార్తీక మాసం చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుంది. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలరు. దీపారాధన, ఉపవాసం చేయడం వల్ల మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కెరీర్ లో కొత్త అవకాశాలు రానున్నాయి.
612
కన్య రాశి....
కన్య రాశివారికి ఈ నెలలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. వృత్తిలో గుర్తింపు సాధించగలరు. శివ చరిత్ర లేదా శివ అష్టక పఠనం చేయడం చాలా శుభప్రదం. అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంది.
712
తుల రాశి...
తుల రాశివారికి ఈ నెల అద్భుతంగా ఉండనుంది. ఆధ్యాత్మికంగా వీరిలో చైతన్యం పెరుగుతుంది. భక్తి ద్వారా మానసిక ప్రశాంతత పొందగలరు. పాత సమస్యలు ఏమైనా ఉంటే.. అవి ఈ సమయంలో తీరిపోయే అవకాశం ఉంటుంది.
812
వృశ్చిక రాశి....
వృశ్చిక రాశివారికి ఈ కార్తీక మాసం అత్యంత అనువైన సమయం. ఈ సమయంలో వీరు ఏ పనులు ప్రారంభించినా విజయవంతమౌతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
912
ధనస్సు రాశి...
ఈ నెలలో ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలు, కొత్త సంబంధాలు వస్తాయి. శివార్చనతో పాటు గంగాస్నానం లేదా దీపదానం చేస్తే అదృష్టం మరింత మెరుగవుతుంది.
1012
మకర రాశి...
మకర రాశివారికి ఈ పవిత్రమైన కార్తీక మాసం చాలా అద్భుతంగా సాగనుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. భక్తితో శివపూజ చేస్తే.. మానసికంగా బలంగా మారతారు.
1112
కుంభ రాశి...
కార్తీకమాసంలో కుంభరాశివారికి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. మీరు చేసే సేవా కార్యక్రమాలు ఫలిస్తాయి. దీపారాధన, ధ్యానం ద్వారా మీలో శాంతి పెరుగుతుంది.
1212
మీన రాశి....
మీనరాశివారికి ఈ నెల అత్యంత శుభప్రదం. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి. శివుని ఆలయంలో దీపం వెలిగించడం, తులసి దళం సమర్పించడం ద్వారా శివకృప లభిస్తుంది.