Zodiac Signs: ఈ 3 రాశులకు మొదలవుతున్న శుక్ర దశ, ఆస్తులు కొనే అవకాశం

Published : Oct 22, 2025, 09:23 AM IST

శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తుంది. శుక్రుడు తన రాశిని మార్చుకుని మూడు రాశుల వారికి (Zodiac Signs) ఆస్తులను కొనే ఛాన్స్ ఇవ్వబోతున్నాడు.  

PREV
16
శుక్రుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  శుక్రుడి సంచారం ఎంత ముఖ్యమైనది. శుక్ర గ్రమం  తన రాశులైన వృషభం, తులా రాశిలోకి సంచరిస్తున్నప్పుడు… అలాగే ఉచ్ఛస్థితిలో మీనరాశిలో ఉన్నప్పుడు, అలాగే కేంద్ర స్థానాల్లో ఉంటే మాళవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల విలాసవంతమైన జీవితం, ఆనందం, మంచి పేరు వస్తుంది.

26
మాళవ్య రాజయోగం

అతిత్వరలో నవంబర్‌లో శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు.  అప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మాళవ్య రాజయోగం ఏర్పడి విపరీతంగా కలిసి వస్తుంది.

36
ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి మాళవ్య రాజయోగం విపరీతంగా కలిసివస్తుంది. వారికి ఆర్థికంగా కలిసివచ్చేలా చేస్తుంది. ఈ రాశిలో 11వ ఇంట్లో శుక్రుడు ప్రవేశిస్తాడు  ఆ ఇల్లు లాభాలను అందించే స్థానం. ఇది మీకు ఊహించిన ఆదాయాన్ని అందిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి రెట్టింపు ఆదాయం వస్తుంది. మీ పిల్లల గురించి శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది.  మీరు పెట్టిన పెట్టబడులు, స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు కలిసివస్తుంది. 

46
మకర రాశి

మకర రాశి వారికి మాళవ్య రాజయోగం కలిసివస్తుంది. ఈ రాజయోగం పదవ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి దక్కే ఛాన్స్ ఉంది. మీ పని అధికారులకు నచ్చుతుంది. వ్యాపారంలో ఆర్ధిక లాభాలు కలిసివస్తాయి. కొత్త ఆదాయ దారులు తెరుచుకుంటాయి. 

56
తులా రాశి

తులా రాశి వారికి మాళవ్య రాజయోగం ఎంతో కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ రాజయోగం మీ లగ్నస్థానంలో ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వం అందరికీ నచ్చుతుంది. శుక్రుడు మీ రాశిలోని మొదటి ఇంట్లో ప్రవేశిస్తాడు. దీనివల్ల మీరు విలాసవంతమైన వస్తువులు కొంటారు. అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారుతారు. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. 

66
ఇతర రాశుల వారికి ఎలా ఉంటుందంటే...

శుక్రుడి వల్ల  వృషభం, మిథునం, కన్య రాశుల వారికి కూడా మాళవ్య రాజ యోగం ప్రభావం పడుతుంది. వీరికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వీరికి వృత్తిపరంగా అంతా మంచే జరుగుతుంది.  ఆస్తి కూడబెట్టే అవకాశాలు ప్రకాశవంతంగా ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories