Zodiac signs: ఈ 4 రాశులకు చెందిన అమ్మాయిలను పడగొట్టడం చాలా కష్టం, పొగడ్తలకు లొంగరు

Published : Nov 09, 2025, 06:05 AM IST

Zodiac signs: జ్యోతిష్యం ప్రకారం  కొన్ని రాశులకు చెందిన మహిళుల చాలా స్ట్రాంగ్. వారిని మాటలతో బోల్తా కొట్టించడం చాలా కష్టం. వీరు పొగడ్తలకు పడరు. అబద్ధాలు చెబితే ఇట్టే కనిపెట్టేస్తారు. ఆ రాశుల వారు ఎవరో తెలుసుకోండి.

PREV
16
తెలివైన రాశులు

జ్యోతిష్యం ప్రకారం జీవితంలో జరిగే అనేక అంశాలను ముందుగానే తెలుసుకోవచ్చు.జ్యోతిష్యంలో 12 రాశుల ప్రత్యేక లక్షణాలు, జీవనశైలి, మానసిక వ్యక్తిత్వం, వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. ముఖ్యంగా, కొన్ని రాశుల మహిళలు ఎంతో నిజాయితీగా ఉంటారు. ప్రేమను, సత్యాన్ని ఎక్కువగా గౌరవిస్తారు.  అబద్ధాలను ఇష్టపడరు. ఎవరైనా అబద్ధం చెబితే వెంటనే పసిగట్టేస్తారు.

26
మిథున రాశి

మిథున రాశి మహిళలు చాలా తెలివైన వారు. వీరు తమ మనసులో ఉన్నదాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పగలరు. వీరి ముందు ఎవరైనా అబద్ధం చెబితే ఇట్టే కనిపెట్టేస్తారు. వీరికి చాలా బలమైన మానసిక జ్ఞానం ఉంటుంది. ఎదుటివారి మాటలు, ప్రవర్తన, ముఖ కవళికల ద్వారా నిజాన్ని గ్రహిస్తారు. పొగడ్తలతో వీరిని సులభంగా పడేయలేరు. వీరు పొగడ్తలకు ఏమాత్రం లొంగరు.  నమ్మకం,  నిజాయితీ వీరికి చాలా ముఖ్యం.

36
కన్యా రాశి

కన్య రాశి మహిళలు ఎన్నో నైపుణ్యాలు కలిగి ఉంటారు. వీరి కళ్ళు నిత్యం పరిశీలిస్తూనే  ఉంటాయి. పొగడ్తలకు వీరు అంత సులభంగా లొంగరు. వీరి జీవనశైలి, ఆలోచనలు వాస్తవికంగా ఉంటాయి. ఏ విషయాన్నైనా న్యాయంగా విశ్లేషించే గుణం వీరికి ఉంటుంది. ఎవరైనా అబద్ధం చెప్పడం ప్రారంభిస్తే, దాని వెనుక ఉన్న కారణాన్ని సులభంగా గ్రహిస్తారు. వీరిని పొగిడినంత మాత్రాన ఎవరికీ లొంగరు.

46
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి మహిళలను ఎంత పొగిడినా అవన్నీ వేస్టు అయినట్టే.  వారు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. వీరికి అంత:దృష్టి ఎక్కువ. అలాగే ధైర్యం కూడా ఎక్కువే. నిజాన్ని కనుగొనే సామర్థ్యం వీరికి  అధికంగా ఉంటుంది. వీరి ముందు ఎవరు అబద్ధం చెప్పినా దొరికిపోతారు. 

56
కుంభరాశి

కుంభ రాశి మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సూటిగా మాట్లాడుతారు. వీరి ఆలోచనలు చాలా విశాలమైనవి. పొగడడం లేదా బహుమతులు అందించడం వల్ల వీరి మనసు గెలవలేరు. నిజమైన భావాలు,  న్యాయంగా ఉండడం మాత్రమే వీరిని ఆకట్టుకుంటాయి. వీరికి అబద్ధం చెబితే చాలా కోపం.

66
వీరితో జాగ్రత్త

పైన చెప్పిన నాలుగు రాశులకు చెందిన మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి ఆలోచనలు, భావాలు, మనస్తత్వం అన్నీ చాలా చురుగ్గా ఉంటాయి. వీరు  ఇతర రాశుల మహిళల కంటే భిన్నం. వీరికి పొగడ్తల కంటే నిజం, నిజాయితీ, నమ్మకం ముఖ్యం. అబద్ధాలు చెప్పేవారు వీరికి చాలా సులభంగా దొరికిపోతారు.

Read more Photos on
click me!

Recommended Stories