
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది.
వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య, ఉద్యోగం విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహన్నిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు.
ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరాశ తప్పదు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.
వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుంచి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్ధిక సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి.
కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.