Zodiac signs Mother in Law: కొన్ని రాశులలో పుట్టిన అత్తలను భరించడం చాలా కష్టం. వారు తమ కోడలు ఏం చేసినా భరించలేరు. విపరీతంగా ద్వేషిస్తారు. ఏ రాశుల వారికి కోడళ్లంటే పడదో తెలుసుకోండి.
అత్తా కోడళ్లకు పడకపోవడం సహజమే. కానీ కొంతమంది అత్తలు మాత్రం చాలా దారుణంగా ఉంటారు. కోడలిని చూస్తేనే కస్సుమంటారు. అలాంటి అత్తలు కచ్చితంగా కొన్ని రాశులకు చెందిన వారై ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల అత్తలకు కోడలిని చూస్తేనే మంట. కోడలు ఏం చేసినా, చేయకపోయినా కూడా గొడవలు పడుతూనే ఉంటుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.
24
సింహ రాశి
సింహ రాశిలో పుట్టిన స్త్రీలకు డామినేషన్ ఎక్కువ. వారికి పుట్టుకతోనే సహజంగానే ఆధిపత్య భావన ఉంటుంది. ఇంట్లో తామే మహారాణి అనుకుంటారు. కోడలి ఎప్పుడు తన చెప్పుచేతల్లో ఉండాలని కోరుకుంటారు. కోడలి నుంచి ఎక్కువ గౌరవం ఆశిస్తారు. కోడలు తమ కంటే తెలివైనది అయితే వీరికి ఏమాత్రం నచ్చదు.
34
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో పుట్టిన అత్తలు చాలా డేంజర్. కోడళ్లకు వీరు పెద్ద శత్రువులే. వీరికి భావోద్వేగాలు ఎక్కువ. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడతారు. ఈ రాశిలో పుట్టిన అత్తలు కుటుంబంపై పూర్తి నియంత్రణ ఉండాలని అనుకుంటారు. ఈ రాశిలో పుట్టిన అత్తలకు అనుమానం ఎక్కువ. తమ కొడుకును కోడలు దూరం చేస్తుందనే అభిప్రాయం వీరిలో ఎక్కువగా ఉంటుంది.
మకర రాశి వారికి సాధారణంగా క్రమశిక్షణ ఉంటుంది. వీరికి కష్టపడి పనిచేసేతత్వం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన అత్తలు సంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తారు. తమ కోడలు కూడా తనలాగే సంప్రదాయం బద్ధంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కోడలు వీరి అంచనాలను అందుకోకపోతే చీటికిమాటికి కోప్పడతారు.