నెంబర్ 3...
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. వీరికి కూడా 2026 చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ తేదీల్లో పుట్టిన వారికి బృహస్పతి అధిపతి. సూర్యుడితో స్నేహపూర్వకంగా ఉండే గ్రహం. కాబట్టి, ఈ ఏడాది ఈ తేదీల్లో పుట్టిన వారు శుభ ఫలితాలను పొందుతారు. ఏడాది మొదట్లో వీరి జీవితాల్లో ఊహించని మార్పులు చూస్తారు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్స్ రావడం లేదంటే... ఈ ఏడాది అది నిజం అయ్యే అవకాశం ఉంది. కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. అంతేకాదు... వీరికి సామాజిక గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఈ ఏడాది మీరు కొత్త భాష నేర్చుకునే అవకాశం పొందుతారు. అలాగే, విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు అపారమైన ప్రయోజనాలు పొందుతారు. అదేవిధంగా నెంబర్ 3 కి చెందిన వ్యక్తుల ఆరోగ్యం 2026లో చాలా బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.