Shani Amavasya: అరుదైన శని అమావాస్య.. ఈ రాశులకు ఊహించని కష్టాలు, చిన్న పరిహారం చేస్తే చాలు

Published : May 15, 2026, 12:19 PM IST

Shani Amavasya: 30 ఏళ్ల తర్వాత అరుదైన శని అమావాస్య వస్తోంది. అయితే ఇది నాలుగు రాశుల వారికి ఊహించని కష్టాలు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. చిన్న పరిహారంతో కష్టం నుంచి బయటపడొచ్చు. 

PREV
15
Shani Amavasya

జోతిష్యశాస్త్రం ప్రకారం దాదాపు 30 ఏళ్ల తర్వాత అమావాస్య రోజున శని జయంతి వస్తోంది. కాబట్టి.. దీనిని శని అమావాస్య అని పిలుస్తారు. అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొన్ని రాశులవారికి దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శని అమావాస్య నాలుగు రాశుల వారికి ఊహించని కష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటి..? ఆ కష్టాలు రాకుండా ఉండేందుకు ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

25
1.వృషభ రాశి...

శని అమావాస్య రోజున వృషభ రాశివారు అనవసరపు ఖర్చులు నియంత్రించుకోవాలి. లేకపోతే డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. అనుకోకుండా ఎక్కువ ఖర్చులు అయిపోతూ ఉంటాయి. పని చేసే చోట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగులతో అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపార సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

35
కర్కాటక రాశి...

శని అమావాస్య సమయంలో కర్కాటక రాశివారు వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని ఒత్తిడి పెరుగుతుంది. కర్కాటక రాశివారు తమ అహంతో కొత్త సమస్యలు తెచ్చి పెట్టుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ రాశివారు ఎవరికీ ఎలాంటి హాని చేయకూడదు. డబ్బు సంబంధిత విషయాల్లో తొందరపడి ఎవరికీ ఎలాంటి హాని చేయకూడదు.

45
తుల రాశి..

శని అమావాస్య తుల రాశివారికి ఊహించని సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు ప్రతికూలత పెరుగుతుంది. జాగ్రత్త లేకపోతే.. పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ సమయంలో ఈ రాశివారు యోగా, శాంతి లాంటివి చేయడం ఉత్తమం. ఎవరికీ అప్పుగా డబ్బులు ఇవ్వకపోవడమే మంచిది. ఎవరికైనా అప్పు ఇస్తే.. ఆ డబ్బులు మళ్లీ తిరిగి మీ చేతికి రాకపోవచ్చు.

55
మీన రాశి...

శని అమావాస్య వేళ మీన రాశివారు ఇతరులతో వివాదాలు, గొడవలకు దూరంగా ఉండాలి. పని భారం పెరుగుతుంది. దాని వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఓపికగా ఉండాలి. లేకపోతే ఊహించని చికాకులు, సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

శని అమావాస్య చెడు ప్రభావాలు తొలగిపోవడానికి చేయాల్సిన పరిహారాలు...

శని అమావాస్య దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి, శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం పాటించండి. శని మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. శని దేవుని అనుగ్రహం వల్ల ఈ కాలంలో మీ కష్టాలు తొలగిపోవచ్చు. రావి చెట్టును పూజించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శని అమావాస్య రోజున పితృదేవతలకు నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories