Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే

Published : May 15, 2026, 07:07 AM IST

Jupiter golden days: గురు గ్రహం జూన్ 18న పుష్య నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గురు సంచారం వల్ల రాబోయే 60 రోజుల పాటు 4 రాశుల వారికి కుబేర యోగాన్ని అందిస్తుంది. ఆ నాలుగు రాశుల వారు జీవితంలో అద్భుతమైన  మంచి ఫలితాలు పొందుతారు. 

PREV
15
కుబేర యోగం పట్టే రాశులు

బృహస్పతి అనగా గురుగ్రహం ప్రతి 12 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు.  జూన్ 18వ తేదీ రాత్రి 9:32 గంటలకు గురు గ్రహం పుష్య నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు.  అక్కడే ఆగస్టు 19వ తేదీ వరకు ఉంటాడు. ఈ 60 రోజుల పాటు గురు గ్రహం దయతో 4 రాశుల వారికి  కుబేర యోగం పట్టబోతోంది. వీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. డబ్బులపరంగా విపరీతంగా కలిసివస్తుంది.

25
కర్కాటక రాశ

కర్కాటక రాశి వారికి గురు నక్షత్ర మార్పు నిజానికి ఒక వరమనే చెప్పాలి. చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు మళ్లీ మొదలవుతాయి.  వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు చేయడం పెరుగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఆఫీసులో పనికి తగ్గ గుర్తింపు దక్కుతుంది.  జీతం కూడా బాగా పెరుగుతుంది. ఈ 60 రోజులు ఈ రాశివారు ఊహించని లాభాలు చూస్తారు.

35
కన్యా రాశి

కన్యా రాశి వారికి గురు గ్రహం మార్పు మానసిక ప్రశాంతతను, ఆర్థిక పురోగతిని అందిస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్నవారికి వారికి మంచి కంపెనీలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఈ రాశి వారి కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. వీరి కష్టానికి రెట్టింపు ఫలితం లభిస్తుంది.

45
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి  ఈ 60 రోజుల సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది.  వీరు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆ  శుభవార్త  అందే అవకాశం ఉంది. మీ పిల్లల ద్వారా మీరు గర్వపడే వార్తలు వింటారు.

55
మీన రాశి

మీన రాశి వారికి గురు గ్రహం వల్ల సకల సౌభాగ్యాలు దక్కుతాయి. ఈ రాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయం వీరికే అనుకూల ఫలితాలనే ఇస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు ఇప్పుడు ముగింపు లభిస్తుంది. ఊహించని ధనలాభం, అదృష్టం దక్కే అవకాశం ఉంది.  ఇల్లు, వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories