ఈ రాశులవారు చాలా ప్రమాదం.. జాగ్రత్తగా ఉండాల్సిందే..!

First Published | Jun 1, 2024, 1:48 PM IST

జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులవారు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దది చేశారు. వీరితో గొడవ చాలా ప్రమాదం.మరి ఆ రాశులవారు ఎవరో ఓసారి చూద్దాం...
 

ఏ ఒక్కరూ ఒకేలా ఉండరు. ఒక్కో మనిషి ఒక్కోలా ఉంటాడు. కొందరు ఎవరితోనైనా మనకు గొడవలు ఎందుకులే అని సర్దుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ.. కొందరు ఉంటారు.. చిన్న విషయాన్ని కూడా చాట అంత చేసి.. పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింది రాశులవారు చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దది చేశారు. వీరితో గొడవ చాలా ప్రమాదం.మరి ఆ రాశులవారు ఎవరో ఓసారి చూద్దాం...

telugu astrology

1.కన్య రాశి..

కన్య రాశివారు తమతోపాటు.. తమ చుట్టూ ఉన్నవారిపై కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. తాము పెట్టుకున్న అంచనాలు ఎవరైనా మించిపోయారు అని తెలిసింది అంటే చాలు... వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు.  అవకాశం వస్తే చాలు.. చిన్న విషయానికి కూడా పెద్ద గొడవే చేస్తారు. నిజానికి కన్య రాశివారు చిన్న విషయంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉ:టారు. కానీ వారిలో ఉన్న ఈ లక్షణమే ఒక్కోసారి వారిలో నెగిటివిటీ పెంచుతుంది. ఈ లక్షణం వల్ల ఇతరులు పట్టించుకోని చిన్నచిన్న విషయాల్లో చిక్కుకుంటారు. కాబట్టి వారు ఇతరులను విమర్శిస్తారు.ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు.
 


telugu astrology

2.వృశ్చిక రాశి..

వృశ్చి క రాశివారు జాలి, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్న విషయాలే కదా అని వదిలేయరు. ఎవరైనా చిన్న మాట అన్నా సీరియస్ అయిపోతారు.  ప్రతి విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తారు. ఇది వారికి ప్రధాన లోపంగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి వృశ్చిక రాశివారు  గొప్ప అంకితభావం, దృఢత్వాన్ని కలిగి ఉంటారు, కానీ, ఈ లక్షణాలే ఒక్కోసారి ఇబ్బందిగా మారతయాి. వారు ముఖ్యంగా వారి ప్రేమ జీవితంలో స్వాధీనత , అసూయ భావాలతో బాధపడుతున్నారు. ఈ సంకేతం బెదిరింపులకు అతిగా స్పందిస్తుంది. చిన్న విషయాలకు కూడా అతిగా స్పందిస్తారు. 

telugu astrology

3.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు మంచి భావోద్వేగ జీవితాన్ని గడుపుతారు. వ్యవస్థీకృతంగా ఉంటారు. వారు కొంచెం దయ , అవగాహన కలిగి ఉంటారు. కానీ వారు హైపర్సెన్సిటివిటీ, మూడినెస్‌కు ఎక్కువ అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎవరైనా చిన్న విషయానికి అతిగా స్పందిస్తారు, అది వారిపై వ్యక్తిగత దాడిగా తీసుకుంటారు. ఇతరులకు ఇది వెర్రి సమస్యగా అనిపించవచ్చు. ఈ సంకేతం వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా సానుభూతి చూపించడానికి ప్రయత్నించండి. లేదంటే చిన్న చిన్న విషయాలకే గొడవ చేస్తారు.

Latest Videos

click me!