నిద్రపోతుండగా.. మనం చాలా మందిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. కొందరైతే.. పడుకున్న వాళ్లను లేపి.. ఓ.. పడుకున్నావా అని అడుగుతూ ఉంటారు. అయితే.. చాణక్య నీతి ప్రకారం... పడుకున్నప్పుడు కొందరిని మాత్రం పొరపాటున కూడా నిద్రలేపకూడదట. అలా నిద్ర లేపడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి ఎవరిని నిద్ర లేపకూడదో , ఎందుకు అలా చేయకూడదో తెలుసుకుందాం..
1.నిద్రపోతున్న రాజుని పొరపాటున కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజుల్లో రాజు ఎక్కడ ఉన్నాడు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ రాజు అంటే మీ బాస్ కూడా అవ్వొచ్చు. మనకన్నా పై అధికారులు నిద్రలో ఉన్నప్పుడు లేపి ఇబ్బంది పెట్టకూడదు. కోపంతో వారు మన ఉద్యోగం తీసేసినా తీసేయవచ్చు. ఇంకా ఏదైనా శిక్ష అయినా వేయవచ్చు. కాబట్టి.. ఇలాంటి పనులు చేయకుండా ఉండటమే మంచిది.
2.నిద్రపోతున్న చిన్న పిల్లలను ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. వాళ్లను నిద్రలో నుంచి లేపకూడదు. ఎందుకంటే... పిల్లలు మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపితే వాళ్లు చిరాకు పడతారు. గట్టిగా ఏడవడం మొదలుపెడతారు. ఇక పిల్లలు ఏడుపు మొదలుపెడితే.. ఆపించడం ఎవరితరమూ కాదు.
3.వెదవలు, పనికిరానివాళ్లు నిద్రపోతున్నా కూడా వాళ్లను లేపకూడదట. ఎందుకంటే... వాళ్లకు పెద్దగా వేరే పని ఏమీ ఉండదు. అలా అని వాళ్ల నిద్రను డిస్టర్బ్ చేస్తే... పెద్దగా గొడవ పెట్టుకుంటారు. మీ సమయం వృథా అవ్వడం తప్ప.. మరో ప్రయోజనం ఉండదు. మీకే టైమ్ వేస్ట్ అవుతుంది.
lion 01.jp
4.నిద్రపోతున్న సింహాన్ని కూడా ఎప్పుడూ కదిలించకూడదు. పడుకున్న సింహం ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సమయంలో మీరు ఏదో ఒకటి చేసి సింహాన్ని లేపితే... దానికి మీరు ఆహారం కావాల్సి వస్తుంది. కాబట్టి.. అలాంటి పనులు చేయకండి.
snakes
5.పడుకున్న సింహాన్ని నిద్రలేపితే ఎంత ప్రమాదమో.. పడుకున్న పామును కదిలించడం కూడా అంతే ప్రమాదం. ఎందుకంటే.. పామును కవదిలిస్తే.. అది కాటు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
6.నిద్రపోతున్న కుక్కను కదిలించడం, లేపడం కూడా మంచి పద్దతి కాదు. ఎందుకంటే... అన్ని కుక్కలు సౌమ్యంగా ఉండవు. కొన్ని కుక్కలు వైల్డ్ కూడా ప్రవర్తిస్తాయి. ఫలితంగా... మీ మీదే పడి.. కరిసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.