Zodiac Signs: డబ్బు సంపాదించడం, దాన్ని ఖర్చు చేయడం ఒక కళ. కొందరు ఎంత ఖర్చు చేసినా వారి దగ్గరకు డబ్బు మళ్లీ తిరిగి వస్తూనే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు ఎంత ఖర్చు చేసినా, ఆర్థికంగా మళ్లీ నిలదొక్కుకుంటారట. ఆ రాశులేవో చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్వభావం, ఆలోచనా విధానం ఉంటుంది. కొందరు ఎంత డబ్బు సంపాదించినా దాచుకోలేరు. మరికొందరు ఖర్చు చేసినా ఆ డబ్బు మళ్లీ ఏదో రూపంలో తిరిగి వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా గురు గ్రహం, శుక్ర గ్రహం, ధన స్థానం బలంగా ఉండే రాశులవారికి ధన ప్రవాహం ఎప్పుడూ కొనసాగుతుందని నమ్మకం. మరి ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందామా..
26
వృషభ రాశి
వృషభ రాశివారు డబ్బు విషయంలో చాలా స్మార్ట్ గా ఉంటారు. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. మంచి వస్తువులు కొనడం, కుటుంబం కోసం ఖర్చు చేయడం, సౌకర్యాలపై డబ్బు వెచ్చించడం వీరికి అలవాటు. అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు. ధనసంపద, విలాసానికి కారకుడు శుక్రుడు. అందువల్ల వీరు ఎంత ఖర్చు చేసినా మళ్లీ సంపాదించే అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. వ్యాపారం, ఆస్తులు లేదా కొత్త అవకాశాల రూపంలో వీరికి ధనలాభం కలుగుతుంది.
36
సింహ రాశి
సింహ రాశివారు కూడా ఖర్చు విషయంలో వెనుకాడరు. వీరు రాజసంగా జీవించడానికి ఇష్టపడతారు. తమ స్థాయికి తగ్గట్టుగా ఖర్చు చేయడాన్ని గౌరవంగా భావిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం విరివిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే వీరి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు వీరిని మళ్లీ ఆర్థికంగా నిలబెడతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సూర్యుడు అధిపతిగా ఉండటం వల్ల వీరికి గుర్తింపు, అవకాశాలు సులభంగా వస్తాయి.
తుల రాశివారు అందం, సౌకర్యం, లగ్జరీ విషయాల్లో రాజీ పడరు. వీరు మంచి దుస్తులు, ఇంటి అలంకరణ, విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. శుక్ర గ్రహ ప్రభావం కారణంగా వీరికి సామాజిక పరిచయాలు బలంగా ఉంటాయి. ఈ పరిచయాల ద్వారానే కొత్త అవకాశాలు, వ్యాపార లాభాలు, ఆర్థిక పురోగతి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
56
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారు కూడా చేతిలో డబ్బు ఉంటే ఖర్చు చేయడానికి వెనుకాడరు. ప్రయాణాలు, కొత్త అనుభవాలు, స్నేహితులతో సరదాలు వీరికి ఎంతో ఇష్టం. అయితే గురు గ్రహ ప్రభావం వల్ల వీరికి అదృష్టం బలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఒకవేళ డబ్బు ఎక్కువగా ఖర్చయినా కొత్త ఆదాయ మార్గాలు త్వరగా కనిపిస్తాయట. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభం లేదా అనుకోని అవకాశాల ద్వారా వీరికి మళ్లీ ఆర్థిక స్థిరత్వం వస్తుందని పండితులు చెబుతున్నారు.
66
మీన రాశి
మీన రాశివారు ఇతరులకు సహాయం చేయడానికి, కుటుంబ సభ్యుల అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అయితే గురు గ్రహ అనుగ్రహం వల్ల వీరికి అవసరమైన సమయంలో డబ్బు కొరత ఉండదని పండితులు చెబుతున్నారు. అనుకోని సహాయం, కొత్త అవకాశాలు లేదా అదృష్టం కలిసి రావడం వల్ల ఖర్చైన డబ్బు మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయట.