Traditional Beliefs: పుట్టింటి నుంచి తమకు నచ్చినవి తెచ్చుకోవడం ఆడ పిల్లలు తమ హక్కుగా భావిస్తారు. కానీ, కొన్నింటిని తెచ్చుకోవడం వల్ల పుట్టింటితో పాటు.. అత్తారింటికి కూడా సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనక ఒక అర్థం ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక కారణం కూడా దాగి ఉంటుంది. వివాహం తర్వాత ప్రతి అమ్మాయి రెగ్యులర్ గా పుట్టింటికి వెళ్తూనే ఉంటుంది. అలా వెళ్లినప్పుడు.. ప్రేమతో తల్లిదండ్రులు ఇచ్చిన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం అమ్మాయిలు పుట్టింటి నుంచి అత్తింటికి పొరపాటున కూడా కొన్ని వస్తువులు తెచ్చుకోకూడదు. వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది. మరి, వేటిని తెచ్చుకోకూడదో ఇప్పుడు చూద్దాం....
27
ఉప్పు, చింతపండు...
పుట్టింటి నుంచి ఆడపిల్ల ఉప్పు, చింతపండు లాంటివి అత్తవారింటికి తెచ్చుకోకూడదు. ఈ రెండూ రుచి, పులుపు కి సంకేతం. వీటిని పుట్టింటి నుంచి తీసుకురావడం వల్ల ఆ ఇంటి ధన సంపద తరిగిపోతుందని నమ్ముతారు. అంతేకాదు, తల్లి ఇంటి అనుబంధం తగ్గిపోతుందనే విశ్వాసం కూడా ఉంది.
37
నూనె ఉత్పత్తులు..
పుట్టింటి నుంచి పూజ నూనె మాత్రమే కాదు, వంట నూనె లాంటివి కూడా తెచ్చుకోకూడదు. నూనె శుభ్రత, ప్రకాశం, శక్తికి సూచిక. వివాహిత స్త్రీ తన తల్లి నుంచి నూనె, నెయ్యి వంటి పదార్థాలు తీసుకురావడం వల్ల ఆమె అడుగుపెట్టిన ఇంటి శాంతి దెబ్బతింటుందని పురాణాలు చెబుతున్నాయి. అత్తారింటికీ, పుట్టింటికీ మధ్య విభేదాలు కూడా రావచ్చు
చేదు కూరగాయలు కోపం, అసంతృప్తిని సూచిస్తాయి. అందుకే తల్లి ఇంటి నుంచి చేదు కూరలుచ ఆకుకూరలు తీసుకురావడం నిషిద్ధం, ఇవి తల్లి ఇంటి సంతోషాన్ని తగ్గిస్తాయని నమ్ముతారు.
57
పూజా సామాగ్రి...
పూజ గది నుంచి ఏ వస్తువునీ తెచ్చుకోకూడదు. అంటే దీపం, పసుపు, కుంకుమ, పూల దండ లాంటివి తెచ్చుకోవడం శాస్త్రోక్తంగా సరికాదు. పూజ వస్తువులు పవిత్రమైనవి, వాటిని పుట్టింటి నుంచి తెచ్చుకుంటే దైవకటాక్షం తగ్గుతుందని నమ్ముతారు.
5.పదునైన వస్తువులు..
ఇవి "కటినత్వం" , "విభేదం" కి ప్రతీకలు. ఇలాంటి పదార్థాలు రెండు ఇళ్ల మధ్య అనవసరమైన వివాదాలను కలిగిస్తాయని విశ్వాసం ఉంది.
67
శుభ్రపరిచే వస్తువులు...
చీపురు, మాప్, బియ్యం కొలిచే కప్పులు లేదా వంటింటి శుభ్రపరిచే వస్తువులను తీసుకురావడం నిషిద్ధం. ఇవి తల్లి ఇంటి "శ్రేయస్సును" తీసుకెళ్తాయని పాత నమ్మకం. ఈ వస్తువులు ఒక ఇంటి శుభ్రత , సంపదకు ప్రతీకలు కాబట్టి, వాటిని అక్కడే ఉంచడం మంగళకరంగా భావిస్తారు.
77
ముగ్గు పిండి...
రంగోలి అంటే ఆనందం, ఆహ్వానం, శుభ సూచికం. కాబట్టి తల్లి ఇంటి నుండి ముగ్గు పిండి తీసుకురావడం వల్ల ఆ ఇంటి శుభం తగ్గుతుందని చెబుతారు. అవసరమైతే, దానిని సొంతంగా కొనుగోలు చేసి వాడడం శుభప్రదంగా ఉంటుంది.