ఈ 4 రాశుల వారితో స్నేహం చేయడం చాలా కష్టం.. వీరివల్ల సంతోషం కంటే బాధే ఎక్కువ!

Published : Nov 13, 2025, 03:54 PM IST

ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. కానీ అన్నీ స్నేహాలు మంచే చేస్తాయనే గ్యారెంటీ లేదు. కొందరు స్నేహితులు జీవితంలో వెలుగు నింపితే మరికొందరు సమస్యలు తీసుకువస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారితో స్నేహం చేయడం కష్టం. ఆ రాశులేంటో చూద్దాం.

PREV
15
ఏ రాశులవారితో స్నేహం చేయడం కష్టం?

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహ బంధం చాలా విలువైనది. నచ్చిన వారితో స్నేహం చేయడం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ప్రతి స్నేహం మనకు శాంతి, సంతోషం, సహాయం అందిస్తాయని కచ్చితంగా చెప్పలేము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారితో స్నేహం మన జీవితాన్ని గజిబిజి చేస్తుంది. మితిమీరిన ఆధిపత్యం, స్వార్థం, అనుమానం లేదా అహంకారం వల్ల మనకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. మరి ఏ రాశులవారితో స్నేహం చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలో ఇక్కడ తెలుసుకుందాం.

25
మిథున రాశి

మిథున రాశివారు మాట్లాడటంలో నిపుణులు. వీరి ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. కానీ వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకరోజు అపారమైన ప్రేమ చూపిస్తారు. మరుసటి రోజు నిర్లక్ష్యం చేస్తారు. వీరి ద్వంద్వ స్వభావం వల్ల స్నేహితులు ఎప్పుడూ గందరగోళంలో పడుతుంటారు. వీరితో స్నేహం చేయడం సరదాగా ఉంటుంది. కానీ లోతైన అనుబంధం ఆశించడం ప్రమాదమే. మిథున రాశివారు స్నేహాన్ని ఒక ఆటలా తీసుకుంటారు. విసుగొస్తే కొత్త స్నేహాలు వెతుక్కుంటారు.

35
సింహ రాశి

సింహం రాశివారు సహజంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వీరికి నాయకత్వం తీసుకోవడం ఇష్టం. కానీ అదే గుణం కొన్నిసార్లు అహంకారంగా మారుతుంది. వీరికి తాము ప్రధాన పాత్రలో ఉండాలన్న తపన ఎక్కువ. స్నేహితుల మధ్య కూడా తాము ముందుండాలని, అందరూ తమను మెచ్చుకోవాలని కోరుకుంటారు. ఒకసారి తమ మాటను ఎవరైనా తిరస్కరిస్తే లేదా తమ ప్రాధాన్యత తగ్గుతుందనే అనిపిస్తే తట్టుకోలేరు. వీరితో స్నేహం చేయాలంటే, వారిని ప్రశంసించడం, సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి.

45
కన్య రాశి

కన్య రాశివారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పులు వెతకడం వీరికి అలవాటు. వీరితో స్నేహం మొదట్లో సంతోషంగా, నిజాయితీగా అనిపిస్తుంది. కానీ కాలక్రమంలో వీరి విమర్శాత్మక స్వభావాన్ని స్నేహితులు తట్టుకోలేకపోతారు. ఎప్పుడూ ఎదుటివారి లోపాలను గమనిస్తూ, వాటిని సరిదిద్దుకోమని చెప్తుంటారు. వీరి ఉద్దేశం మంచిదే అయినా,  చెప్పే పద్ధతి మనసుకు బాధ కలిగించవచ్చు. వీరితో స్నేహం చేయాలంటే సహనం ఎక్కువగా ఉండాలి.

55
వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారు గంభీరంగా ఉంటారు. రహస్యమైన స్వభావం కలిగి ఉంటారు. మొదట్లో వీరు చాలా ఆకర్షణీయంగా, నమ్మదగిన వారిలా కనిపిస్తారు. కానీ స్నేహం చేసే కొద్దీ వీరి స్వభావం పూర్తిగా బయటపడుతుంది. వీరికి మితిమీరిన అనుమానం ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకుని మనసులో పెట్టుకుంటారు. సరైన సమయంలో దానికి ప్రతీకారం తీర్చుకోవడమే వీరి ధోరణి. వృశ్చిక రాశివారి స్నేహం ఎంత బలంగా ఉంటుందో, అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. కాబట్టి వీరితో స్నేహం చేసేటప్పుడు మాటలు, చర్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories