1.సింహ రాశి..
10వ కేంద్రంలో శుక్రుడు సంచరించడం వల్ల మాళవ్య యోగం, 7వ కేంద్రంలో శని సంచారం సింహరాశికి చాలా బాగా కలిసి రానుంది. ఈ యోగాలు రాజకీయ ప్రభావాన్ని కలిగిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయం పెరుగుతుంది. మనసులోని కోరికలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగుల ప్రాముఖ్యత, ప్రభావం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగం పొందే యోగం చాలా ఎక్కువగా ఉంది.