డబ్బు లెక్కించేటప్పుడు ఇలా చేయకూడదా?

First Published | Jun 1, 2024, 3:32 PM IST

బతకడానికి డబ్బు అవసరం. అలాంటి డబ్బుకు సంబంధించిన తప్పులు చేశారంటే మీ చేతిలో డబ్బులు నిలవవని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆర్థిక కష్టాలు రావొద్దంటే ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారు జీవితంలో డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు జ్యోతిష్యులు. సంపద దేవత అనుగ్రహం ఉన్నంత వరకు వీళ్ల దగ్గర డబ్బుకు కొదవే ఉండదు. అలాగే లక్ష్మీదేవి నివసించే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది.
 

జీవితంలో శ్రేయస్సును, సంపదను పొందడానికి ప్రతిరోజూ శ్రీమహావిష్ణువును, లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. ఈ ఇద్దరి అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బుకు కొదవే ఉండదు. కానీ కొన్ని పనులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాయి. దీనివల్ల మీరు మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. డబ్బుకు సంబంధించి కొన్ని తప్పులు చేస్తే మీరు జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


లాలాజలం

డబ్బును లెక్కించేటప్పుడు చాలా మంది ఈ తప్పును చేస్తుంటారు. ఇలా చేస్తే ఏమౌతుందో కూడా ఆలోచించరు. కానీ మీరు డబ్బును లెక్కించేటప్పుడు లాలాజలాన్ని ముట్టుకోకూడు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. అంతేకాకుండా ఇది లక్ష్మీదేవికి కోపం కూడా తెప్పిస్తుంది. దీనివల్ల మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

ముడవొద్దు.. 

చాలా మంది హడావుడిగా ఉన్నప్పుడు లేదా బస్ లో వెళుతున్నప్పుడు, లేదా ఏదైనా కొన్నప్పుడు డబ్బును జేబులో ముడిచిపెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఇది లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది.

money

అన్ని చోట్లా పెట్టొద్దు

కొంతమంది ఇంట్లో డబ్బులు ఎక్కడకు పోతాయిలే అని ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. వాస్తు ప్రకారం.. ఇది లక్ష్మీదేవికి అవమానంగా కూడా పరిగణించబడుతుంది. దీనివల్ల మీరు చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

ఇతర వస్తువులను ఉంచొద్దు

వాస్తు ప్రకారం.. డబ్బు ఉంచిన ప్రదేశంలో ఇతర అనవసరమైన వస్తువులను పెట్టడం మంచిది కాదు. ఉదాహరణకు.. మీరు వాలెట్ లో డబ్బుతో కూడిన బిల్లును పెట్టడం. మీకు కూడా ఈ అలవాటు ఉంటే.. ఈ రోజు నుంచే ఈ పని చేయడం మానుకోండి. రాత్రి నిద్రపోయేటప్పుడు పర్సు లేదా డబ్బును మీ తల దగ్గర కూడా పెట్టుకోకూడదు. మీరు డబ్బును ఉంచే చోట మాత్రమే డబ్బును పెడితే మీకు అదృష్టం కలుగుతుంది. 

Latest Videos

click me!