నెంబర్ 7...
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై కేతువు ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారంతా చాలా ఆధ్యాత్మికంగా, పరిశోధనా పరంగా ముందుకు వెళ్లాలని అనుకుంటారు.వీరు నెమలి ఈకను తమ డైరీలో లేదా పుస్తకాల మధ్య ఉంచుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు దూరమై విజయం వైపు అడుగులు వేస్తారు.
నెమలి ఈకను ఎలా ఉంచాలి?
ఆర్థిక లాభం కోసం: మీ ఇంట్లోని దక్షిణ దిశలో ఉన్న బీరువా లేదా లాకర్‌లో నెమలి ఈకను ఉంచండి. దీనివల్ల ధన ప్రవాహం పెరుగుతుంది.
వాస్తు దోషం కోసం: ఇంటి ప్రధాన ద్వారం వద్ద మూడు నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. నెమలి ఈక ఎప్పుడూ విరిగిపోకుండా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని నేల మీద పడేయకూడదు.